Telugu Global
NEWS

అప్పట్లో టీఆర్‌ఎస్‌ను గట్టిగా నిలదీసింది నేనే

ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. కేవలం మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకే ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ప్రకటనలు చేస్తోందన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడింది తానేనన్నారు. నేతలు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించడం కరెక్ట్ కాదని చెప్పానన్నారు. కాకపోతే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలు దొంగ తిరుగుడు రాజకీయం చేయలేదని అందుకు మాత్రం అభినందించాల్సిందేనన్నారు. టీఆర్‌ఎస్‌ కు తాను ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు తెలపలేదన్నారు. డల్లాస్‌లో ఎన్‌ఆర్‌ఐలతో చిట్‌చాట్ […]

అప్పట్లో టీఆర్‌ఎస్‌ను గట్టిగా నిలదీసింది నేనే
X

ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. కేవలం మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకే ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ప్రకటనలు చేస్తోందన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడింది తానేనన్నారు.

నేతలు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించడం కరెక్ట్ కాదని చెప్పానన్నారు. కాకపోతే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలు దొంగ తిరుగుడు రాజకీయం చేయలేదని అందుకు మాత్రం అభినందించాల్సిందేనన్నారు. టీఆర్‌ఎస్‌ కు తాను ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు తెలపలేదన్నారు.

డల్లాస్‌లో ఎన్‌ఆర్‌ఐలతో చిట్‌చాట్ చేసిన పవన్‌… రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. టీడీపీ, వైసీపీలతో కలిసే ప్రసక్తే లేదన్నారు. వామపక్షాలను మాత్రం కలుపుకుపోతామన్నారు. ఏపీలో బీజేపీకి బలం పోయిందన్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే మరోలా ఉండేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీతో కలిసి వెళ్లడం ఆత్మవంచనే అవుతుందని అన్నారు.

First Published:  13 Dec 2018 4:06 AM GMT
Next Story