Telugu Global
NEWS

డిపాజిట్లకు దూరమైన కమ్యూనిస్టులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. గుంపులు గుంపులుగా వస్తే ఓట్ల శాతం పెరుగుతుందన్న భ్రమను పటాపంచలు చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కలిసి వచ్చినా ఒంటరిగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. అటు ఈ ఎన్నికల్లో వామపక్షాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. ఒక్క చోట కూడా వామపక్ష అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో స్థానంలో విజయం సాధించగా… ఈసారి మాత్రం […]

డిపాజిట్లకు దూరమైన కమ్యూనిస్టులు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. గుంపులు గుంపులుగా వస్తే ఓట్ల శాతం
పెరుగుతుందన్న భ్రమను పటాపంచలు చేశారు.

కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ కలిసి వచ్చినా ఒంటరిగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. అటు ఈ ఎన్నికల్లో వామపక్షాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. ఒక్క చోట కూడా వామపక్ష అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు.

గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో స్థానంలో విజయం సాధించగా… ఈసారి మాత్రం జీరోకు పడిపోయారు. కేవలం రెండు చోట్ల మాత్రమే వామపక్ష అభ్యర్థులు డిపాజిట్లు సొంతం చేసుకున్నారు. చాలా స్థానాల్లో వామపక్ష అభ్యర్థులకు కేవలం వందకు లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి.

టీజేఎస్‌ కూడా గాల్లో కలిసిపోయింది. కూటమితో వెళ్లినా కోదండరాం పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. వామపక్షాలను, చోటా పార్టీలను తెలంగాణ ప్రజలు ఈసారి పూర్తిగా తిరస్కరించారు.

First Published:  11 Dec 2018 9:23 PM GMT
Next Story