Telugu Global
NEWS

టీడీపీ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా ఈరన్న ఎన్నికల చెల్లదని సుప్రీం కోర్టు కూడా ధృవీకరించింది. 2014లో మడకశిర నుంచి పోటీ చేసిన ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో అనేక అంశాలను దాచారు. కర్నాటకలో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదు. తన భార్య ప్రభుత్వ ఉద్యోగిని అన్న విషయాన్ని కూడా దాచిపెట్టారు. దీంతో ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. సుధీర్ఘ విచారణ […]

టీడీపీ ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
X

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా ఈరన్న ఎన్నికల చెల్లదని సుప్రీం కోర్టు కూడా ధృవీకరించింది. 2014లో మడకశిర నుంచి పోటీ చేసిన ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో అనేక అంశాలను దాచారు. కర్నాటకలో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదు. తన భార్య ప్రభుత్వ ఉద్యోగిని అన్న విషయాన్ని కూడా దాచిపెట్టారు.

దీంతో ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. సుధీర్ఘ విచారణ తర్వాత కొద్ది రోజుల క్రితమే ఈరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి కొనసాగుతారని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రమాణస్వీకారానికి వైసీపీ నేత తిప్పేస్వామి సిద్ధమవుతున్న సమయంలో… ఈరన్న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సమర్ధించింది. తదుపరి ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తిప్పేస్వామి కొనసాగుతారని సుప్రీం కోర్టు వెల్లడించింది.

First Published:  12 Dec 2018 1:48 AM GMT
Next Story