Telugu Global
NEWS

తెలుగు తమ్ముళ్ల‌లో ఇప్పుడు ఇదే చ‌ర్చ

తెలంగాణలో వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ఏమేర‌కు ఆంధ్రా ఎన్నిక‌ల‌పై ప‌డుతుంది? అతి స‌మీపంలోనే ఉన్న ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు తారుమారు అవుతాయా? ఇపుడు తెలుగు తమ్ముళ్ల‌లో ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణలో పాగా వేయాల‌ని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా చేసుకొని ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పోరాటం చేశారు. కానీ క‌లిసి రాలేదు. తెలంగాణ ఆద‌రించ‌లేదు. దీంతో ఖంగుతిన్న చంద్ర‌బాబు ఇపుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఆయ‌న‌తో పాటు తెలుగు త‌మ్ముళ్లు అంతా ప‌రిప‌రి విధాలుగా ఆలోచిస్తున్నారు. తెలంగాణ […]

తెలుగు తమ్ముళ్ల‌లో ఇప్పుడు ఇదే చ‌ర్చ
X

తెలంగాణలో వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ఏమేర‌కు ఆంధ్రా ఎన్నిక‌ల‌పై ప‌డుతుంది? అతి స‌మీపంలోనే ఉన్న ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు తారుమారు అవుతాయా? ఇపుడు తెలుగు తమ్ముళ్ల‌లో ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణలో పాగా వేయాల‌ని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా చేసుకొని ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పోరాటం చేశారు. కానీ క‌లిసి రాలేదు. తెలంగాణ ఆద‌రించ‌లేదు. దీంతో ఖంగుతిన్న చంద్ర‌బాబు ఇపుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఆయ‌న‌తో పాటు తెలుగు త‌మ్ముళ్లు అంతా ప‌రిప‌రి విధాలుగా ఆలోచిస్తున్నారు.

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏమేర‌కు ఆంధ్రాపై ప్ర‌భావం చూపుతాయ‌నే భ‌యం ప‌ట్టుకుంది. అంచానాలు త‌ల్ల‌కిందులైన ప‌రిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాల‌నేది అంతుప‌ట్ట‌కుండా ఉంది. అయితే ఈ ఫ‌లితాల‌పై తెలుగు త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకు కూర్చున్నారు. ఎన్ని య‌త్నాలు చేసినా ఫ‌లితాలు అనుకున్న‌ట్లుగా రాక‌పోయే స‌రికి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ఖంగుతిన్న‌ది.

దీని ప్ర‌భావం ఏమేర‌కు రాబోయే ఎన్నిక‌ల్లో ఆంధ్రాపై ప‌డుతుందనే అంచ‌నా వేసుకుంటున్నారు. ఈ ప్ర‌భావం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌ని అధికార పార్టీనాయ‌కులే అంగీక‌రిస్తున్నారు. అయితే గతంలో లాగా దీనిపై చంద్ర‌బాబు ఏదో ఓక‌టి చేస్తార‌నే న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతోంద‌ని వారు పేర్కొంటున్నారు.

ఇన్నాళ్లూ చంద్ర‌బాబు సీనియారిటీ, వ్యూహాత్మ‌కం అన్నీ ప‌నిచేస్తాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ అంద‌రూ నమ్ముతూ వచ్చారు. కానీ ఇప్పుడు…. చంద్ర‌బాబు వ‌య‌సు మీద‌ప‌డింద‌ని, వ్యూహాలు రూపొందించే విష‌యంలో ఆయన త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే.

First Published:  12 Dec 2018 12:40 AM GMT
Next Story