Telugu Global
NEWS

టీడీపీలో వణుకు పుట్టిస్తున్న కూకట్‌పల్లి విశ్లేషణ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చాయి. టీడీపీకి భవిష్యత్తు దృశ్యాన్ని చూపించాయి. కంచుకోటలు అనుకున్న నియోజక వర్గాల్లో టీడీపీ కుప్పకూలిపోయింది. కూకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అని…. అక్కడ టీడీపీ తప్ప మరోపార్టీ గెలవదు అన్న భ్రమను చాలా కాలం నుంచే టీడీపీ సృష్టించగలిగింది. కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఆంధ్రా ప్రాంత ఓటర్లు మొత్తం టీడీపీ ఓటర్లే అన్న అభిప్రాయాన్ని కలిగించి ఇంతకాలం కూకట్‌పల్లి అంటే అది టీడీపీ గెస్ట్‌ హౌజ్ అన్న అభిప్రాయాన్ని కలిగించారు. కానీ […]

టీడీపీలో వణుకు పుట్టిస్తున్న కూకట్‌పల్లి విశ్లేషణ
X

తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చాయి. టీడీపీకి భవిష్యత్తు దృశ్యాన్ని చూపించాయి. కంచుకోటలు
అనుకున్న నియోజక వర్గాల్లో టీడీపీ కుప్పకూలిపోయింది. కూకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అని…. అక్కడ టీడీపీ తప్ప
మరోపార్టీ గెలవదు అన్న భ్రమను చాలా కాలం నుంచే టీడీపీ సృష్టించగలిగింది.

కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఆంధ్రా ప్రాంత ఓటర్లు మొత్తం టీడీపీ ఓటర్లే అన్న అభిప్రాయాన్ని కలిగించి ఇంతకాలం
కూకట్‌పల్లి అంటే అది టీడీపీ గెస్ట్‌ హౌజ్ అన్న అభిప్రాయాన్ని కలిగించారు. కానీ తాజా ఫలితాల్లో టీడీపీకి గట్టి
పట్టుందని చెప్పుకున్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు చిత్తైపోయారు.

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినిని బరిలో దింపినా అక్కడ కనివిని ఎరుగుని రీతిలో 41వేల ఓట్ల తేడాతో సుహాసిని
ఓడిపోయారు. శేరిలింగపల్లిలో భవ్యాప్రసాద్‌ 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఈ ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఫలితాలకు ఒక సూచిక అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న చోటా, అందులోనూ గతంలో టీడీపీకి అండగా నిలిచిన నియోజకవర్గాల్లో టీడీపీ 40వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే…. సీమాంధ్ర సెటిలర్లు కూడా టీడీపీపై ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందులోనూ నందమూరి సుహాసిని, భవ్యాప్రసాద్‌లు భారీగా డబ్బును కూడా ఖర్చు చేశారు. కానీ గెలుపు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఈ రెండు నియోజక వర్గాల్లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర సామాజికవర్గాల వారు మూకుమ్మడిగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసినట్టు అంచనా వేస్తున్నారు.

కూకట్‌పల్లి ఫలితాన్ని బట్టి సీమాంధ్ర ప్రజల నాడిని కూడా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో సాగిస్తున్నపాలనపై తమకున్న ఆగ్రహాన్ని సీమాంధ్ర ప్రజలు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో చూపించారని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఓటర్లు స్పందిస్తారేమో చూడాలి.

First Published:  11 Dec 2018 10:56 PM GMT
Next Story