Telugu Global
NEWS

బాబును నమ్మి నిండా మునిగిన తెలుగు త‌మ్ముళ్లు!

తెలంగాణా ఎన్నిక‌ల‌పై ఆంధ్రాలో కోట్ల రూపాయ‌ల్లో పందాలు కాశారు. ఎన్నిక‌ల ఆరంభంలో టి.ఆర్‌.ఎస్. గెలుస్తుంద‌నే భావ‌న ఉండేది. అపుడు ఎవ‌రూ పందాలు క‌ట్టలేదు. ఎ.పి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ ఎన్నిక‌ల్లో రంగ‌ప్ర‌వేశం చేయ‌డం, ప్ర‌జాకూట‌మి ఏర్పాటు, విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డంతో ప‌రిస్థితులు కొంత మారాయి. దీనికి తోడు బాబుకు అనుకూలంగా ఉండే మీడియా కూడా తెలంగాణలో ప్ర‌జాకూటమిదే హ‌వా అంటూ రొద‌చేశాయి. హైద‌రాబాద్ ను అభివృద్ది చేశాన‌ని, తెలంగాణాలో కూడా పాగా వేస్తామ‌ని నమ్మ‌బ‌లికారు. కాంగ్రెస్‌తో క‌లిసి […]

బాబును నమ్మి నిండా మునిగిన తెలుగు త‌మ్ముళ్లు!
X

తెలంగాణా ఎన్నిక‌ల‌పై ఆంధ్రాలో కోట్ల రూపాయ‌ల్లో పందాలు కాశారు. ఎన్నిక‌ల ఆరంభంలో టి.ఆర్‌.ఎస్. గెలుస్తుంద‌నే భావ‌న ఉండేది. అపుడు ఎవ‌రూ పందాలు క‌ట్టలేదు. ఎ.పి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ ఎన్నిక‌ల్లో రంగ‌ప్ర‌వేశం చేయ‌డం, ప్ర‌జాకూట‌మి ఏర్పాటు, విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డంతో ప‌రిస్థితులు కొంత మారాయి. దీనికి తోడు బాబుకు అనుకూలంగా ఉండే మీడియా కూడా తెలంగాణలో ప్ర‌జాకూటమిదే హ‌వా అంటూ రొద‌చేశాయి.

హైద‌రాబాద్ ను అభివృద్ది చేశాన‌ని, తెలంగాణాలో కూడా పాగా వేస్తామ‌ని నమ్మ‌బ‌లికారు. కాంగ్రెస్‌తో క‌లిసి తెలంగాణలో ప‌య‌నించ‌డం వ‌ల్ల ప‌రిస్థితులు మెరుగు ప‌డ్డాయ‌ని అంద‌రూ భావించారు. దీనికి తోడు మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ చేసిన స‌ర్వేకూడా బెట్టింగ్‌రాయుళ్ల‌కు న‌ష్టం క‌లుగ‌జేసింది.

ఒక‌వైపు చంద్ర‌బాబు, మ‌రో వైపు కొన్ని మీడియాలు, ల‌గ‌డ‌పాటి క‌లిసి ఆంధ్ర‌ప్ర‌జ‌ల్నిన‌ట్టేట ముంచారు. వీరిని న‌మ్ముకొని పందాలు క‌ట్టిన వారికి ఇపుడు చేతులు కాలాయి. టి.ఆర్‌.ఎస్‌.ప‌ని అయిపోయింది, ప్ర‌జాకూట‌మి బ‌ల‌ప‌డింది అంటూ ఊద‌ర‌కొట్టేయ‌డంతో అంద‌రూ ప్ర‌జాకూట‌మి గెలుస్తుంద‌ని అంచ‌నాకు వ‌చ్చారు. మ‌రో వైపు చంద్ర‌బాబు చెప్పే మాట‌ల్ని కూడా పూర్తిస్థాయిలో న‌మ్మారు. దీంతో కోట్లాదిరూపాయ‌ల మేర పందాలు కాశారు.

టి.ఆర్‌.ఎస్‌. గెలుస్తుందా లేదా, ప్ర‌జాకూట‌మికి ఎన్నిసీట్లు వ‌స్తాయి వంటి అంశాల‌తో పాటు నంద‌మూరి వంశ‌స్తురాలు సుహాసిని గెలుస్తుంద‌ని కూడా జోరుగా పందాలు క‌శారు. ఇప్పుడు అంద‌రూ చేతులు కాల్చుకున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు వ‌ల్ల కోట్లు స‌మ‌కూరుతాయ‌ని అంచ‌నా వేసుకున్న వారంతా ఇపుడు బాబును తిట్టుకుంటున్నారు.

First Published:  11 Dec 2018 9:22 PM GMT
Next Story