Telugu Global
National

రాజస్థాన్ సీఎం ఎవరు..? రాహుల్‌కు విషమ పరీక్ష..!

రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నడుము హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ పోరులో చివరకు కాంగ్రెస్ పార్టీదే పైచేయి అయ్యింది. వోట్ల లెక్కింపు తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ 99 అసెంబ్లీ స్థానాలు సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు రెండు స్థానాల దూరంలో నిలిచినా స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లభించడంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందడంతో ఇప్పుడు అందరి దృష్టీ సీఎం అభ్యర్థిపై పడింది. ప్రస్తుతం రాజస్థాన్ […]

రాజస్థాన్ సీఎం ఎవరు..? రాహుల్‌కు విషమ పరీక్ష..!
X

రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నడుము హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ పోరులో చివరకు కాంగ్రెస్ పార్టీదే పైచేయి అయ్యింది. వోట్ల లెక్కింపు తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ 99 అసెంబ్లీ స్థానాలు సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు రెండు స్థానాల దూరంలో నిలిచినా స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లభించడంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది.

కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందడంతో ఇప్పుడు అందరి దృష్టీ సీఎం అభ్యర్థిపై పడింది. ప్రస్తుతం రాజస్థాన్ పీసీపీ అధ్యక్షుడిగా ఉన్న సచిన్ పైలెట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు పైలెట్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

అశోక్ గెహ్లాత్ 1998 నుంచి 2003 వరకు తిరిగి 2008 నుంచి 2013 వరకు రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతకు మునుపు కేంద్ర మంత్రిగా చాలా కాలం విధులు నిర్వర్తించారు. ఎంతో రాజకీయ అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా ప్రస్తుత ఎన్నికల్లో గెహ్లాత్ పాత్ర మరువ లేనిది.

మరోవైపు రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ 2013 నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉండటంతో 2013లో కాంగ్రెస్ అతడినే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. కాని అప్పుడు కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచి పార్టీని అంటి పెట్టుకొని ఉన్న పైలెట్ ఈ ఏడాది ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు.

మూడు రాష్ట్రాల్లో అధికారంలోని రావడం రాహుల్ గాంధీకి ఘనత తెచ్చే విషయమే. రాజస్థాన్‌లో అశోక్, సచిన్ వర్గాలు చాలా బలంగా ఉన్నాయి. ఒకరికి సీఎం పదవి ఇస్తే మరొకరు అలిగే ప్రమాదం ఉంది. కీలకమైన 2019 ఎన్నికల ముందు ఒక పెద్ద రాష్ట్రంలో వర్గ విభేదాలు ఉండొద్దని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ జైపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సచిన్‌కి మద్దతుగా ర్యాలీలు తీశారు. మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా సచిన్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అశోక్ గెహ్లాత్ కూడా తన పాత పరిచయాలతో రాహుల్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

గెలిచామనే ఆనందంలో ఉన్న రాహుల్ గాంధీకి రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇవాళ సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

First Published:  12 Dec 2018 5:50 AM GMT
Next Story