Telugu Global
NEWS

బాబు ఎక్కించిన కులగజ్జితో ఓటేస్తే మన కమ్మవాళ్లను సభ్య సమాజం బహిష్కరిస్తుంది....

ప్రజల్లో నీతి, నిజాయితీ, కృతజ్ఞత, ఆలోచన ఉంటే టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని గతంలో చెప్పేవాడినన్నారు దర్శకుడు పోసాని కృష్ణమురళీ. కానీ హఠాత్తుగా సైందవుడిలా చంద్రబాబు డబ్బు సంచులతో దిగారన్నారు. డబ్బును విపరీతంగా పంచారన్నారు. భవ్య ఆనంద ప్రసాద్‌ 70లక్షలతో పట్టుబడడమే అందుకు ఉదాహరణ అన్నారు. తెలంగాణలో ఇలా డబ్బు ప్రవాహం చూడడం ఇదే తొలి సారి అన్నారు. ఇది కేవలం చంద్రబాబు వల్లే జరిగిందన్నారు. చంద్రబాబు డబ్బు సంచులను చూసిన తర్వాత తనకు కూడా భయమేసిందని పోసాని చెప్పారు. […]

బాబు ఎక్కించిన కులగజ్జితో ఓటేస్తే మన కమ్మవాళ్లను సభ్య సమాజం బహిష్కరిస్తుంది....
X

ప్రజల్లో నీతి, నిజాయితీ, కృతజ్ఞత, ఆలోచన ఉంటే టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని గతంలో చెప్పేవాడినన్నారు దర్శకుడు పోసాని కృష్ణమురళీ. కానీ హఠాత్తుగా సైందవుడిలా చంద్రబాబు డబ్బు సంచులతో దిగారన్నారు. డబ్బును విపరీతంగా పంచారన్నారు. భవ్య ఆనంద ప్రసాద్‌ 70లక్షలతో పట్టుబడడమే అందుకు ఉదాహరణ అన్నారు.

తెలంగాణలో ఇలా డబ్బు ప్రవాహం చూడడం ఇదే తొలి సారి అన్నారు. ఇది కేవలం చంద్రబాబు వల్లే జరిగిందన్నారు. చంద్రబాబు డబ్బు సంచులను చూసిన తర్వాత తనకు కూడా భయమేసిందని పోసాని చెప్పారు. కానీ వాటిని తట్టుకుని నిలబడిన తెలంగాణ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టాలన్నారు.

సైందవుడులాంటి చంద్రబాబుకు… సైందవ పార్ట్‌ 2గా లగడపాటి వచ్చారన్నారు. కిందా పైనా గూటమే వస్తుందని లగడపాటి చెప్పారన్నారు. కేసీఆర్‌ కూడా ఓడిపోతారని స్వయంగా పోలీసులే గజ్వేల్‌లో చెప్పారని లగడపాటి వివరించారని గుర్తు చేశారు.

ఒక్క బక్కవాడిని కొట్టడానికి ఇంత మంది రావడం…. చివరకు తనకు ఇష్టమైన గద్దర్‌ కూడా కూటమి వైపు నిలబడడం చూసి బాధ పడ్డానన్నారు. ఈ పరిస్థితులు చూసి ఈ ఒక్కసారి కేసీఆర్‌ను గెలిపించు అని దేవుడిని కోరుకున్నానని చెప్పారు.

సాటి మనిషిని గౌరవించే స్వభావం తెలంగాణ ప్రజల్లో ఉందని తాను తొలి నుంచి కూడా చెబుతున్నానన్నారు. తెలంగాణ ప్రజలకు గొప్ప మనస్తత్వం ఉండబట్టే కేసీఆర్‌ను గెలిపించారన్నారు.

చంద్రబాబు ఎప్పుడూ జనంలో తిరుగుతుంటానని చెప్పుకుంటారని… మరి ఇంటి పక్కనే వనజాక్షిని చెప్పులతో కొడితే కనిపించలేదా… ఎక్కడ తాగి చంద్రబాబు పడుకున్నారని పోసాని ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబు కేసీఆర్‌ ఫాంహౌజ్ లో పడుకుంటారని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

తాను కమ్మవాడినేనని…. చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ వాళ్లు అంటరాని వారిగా బతుకుతున్నారని పోసాని చెప్పారు. ఇతర కులాలకు ఓట్లేస్తే కమ్మవాళ్లను బతకనివ్వరు అని కమ్మ కులంలోని అమాయకులను నమ్మించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఒక్క కమ్మవాళ్లకు మాత్రమే ఈ కులగజ్జి ఎక్కించింది చంద్రబాబేనన్నారు. కులమత సహనం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.

ఇంట్లో అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటే అమ్మాయి కులం చూసి చేస్తారా లేక అమ్మాయి ఎలాంటిది అని తెలుసుకుని పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించారు. కమ్మవాళ్లకు స్వతహాగా కులగజ్జి లేదని… చంద్రబాబు వచ్చాకే వారికి ఎక్కించారన్నారు. దాని వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కమ్మవాళ్లు ఇతర కులాల వద్ద అంటరానివారిగా బతకాల్సి వచ్చిందన్నారు. కానీ హైదరాబాద్‌లో ఉన్న కమ్మవాళ్లు మాత్రం ఈసారి కులపిచ్చితో ఓటేయలేదని… అందుకే కూకట్‌పల్లిలో సుహాసిని ఓడిపోయిందన్నారు.

కూకట్‌పల్లిలో కమ్మవాళ్లు ఎక్కువగా ఉన్నారని… హఠాత్తుగా సుహాసినీని చంద్రబాబు రంగంలోకి దింపారన్నారు. కానీ ఇక్కడ ఉన్న కమ్మవాళ్లు చంద్రబాబు రాజకీయాన్ని అర్థం చేసుకుని అప్రమత్తమయ్యారన్నారు. చంద్రబాబు కులపిచ్చికి లోనైతే ఏం జరుగుతుందో హైదరాబాద్‌లోని కమ్మవాళ్లు అర్థం చేసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కమ్మవాళ్లు కూడా చంద్రబాబు కులగజ్జిని చూసి కాకుండా నిజాయితీగా ఉండేవారికి ఓటేయాలని సూచించారు. మరోసారి కులగజ్జితో చంద్రబాబుకు ఓటేస్తే రాబోయే కాలంలో… కమ్మవాళ్లు సభ్యసమాజానికి దూరమై బతకాల్సి ఉంటుందన్నారు.

కమ్మ అభిమానం వ్యక్తిగతంగా ఉంచుకోవాలని సూచించారు. జగన్‌ను ఆయన తల్లి, చెల్లే హత్య చేయించేందుకు ప్రయత్నించారని మనిషి అనే వాడు ఎవడైనా అంటారా అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు కింద పనిచేస్తున్నారు కాబట్టే ఇలాంటి దిగజారుడు ప్రకటనలు కూడా చేస్తున్నారన్నారు.

సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచినోడిని, తండ్రిపై చెప్పులు వేసినోడిని ఏమీ చేయలేని బాలకృష్ణ కేసీఆర్ తాటా తీస్తారా అని ప్రశ్నించారు. సుహాసినిని ఎందుకు దగ్గరుండి గెలిపించలేకపోయారని నిలదీశారు. చంద్రబాబుకు తిరిగి కేసీఆర్‌ గిఫ్ట్‌ ఇవ్వాల్సిందేనన్నారు. లగడపాటి గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తోందన్నారు.

సైబరాబాద్‌ను జనార్దన్ రెడ్డి హయాంలో మొదలుపెడితే…. దాని చుట్టూ భూములు మాత్రం చంద్రబాబు మనుషులే కొన్నారన్నారు. హైటెక్ సిటీ చుట్టూ భూములు కమ్మవాళ్ల చేతుల్లో లేకపోతే తనను చెప్పుతో కొట్టండి అని సవాల్ చేశారు.

ఇప్పుడు అమరావతిలో భూముల విషయంలోనూ అదే చేశారన్నారు. ఆంధ్రాలో టీఆర్‌ఎస్ వచ్చి పోటీ చేసినా… ఆంధ్రా వరకు మాత్రం తాను జగన్‌కే సపోర్టు చేస్తానని పోసాని చెప్పారు.

First Published:  12 Dec 2018 6:15 AM IST
Next Story