Telugu Global
NEWS

ఆ ఇద్ద‌రు సెంటిమెంట్‌ను గెలిచారు !

సెంటిమెంట్‌. రాజ‌కీయ నాయ‌కుల‌కు ఒక‌సారి ఆ సెంటిమెంట్ ఏర్ప‌డితే వ‌దల‌డం చాలా క‌ష్టం. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అలాగే సెంటిమెంట్ ఏర్ప‌డింది. అందులో ఒక‌టి ప‌ర‌కాల‌. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పుట్టిన‌ప్ప‌టి నుంచి ఈ సెంటిమెంట్ నిజ‌మైంది. కానీ ఈ సారి ఎన్నిక‌లు సెంటిమెంట్‌ను ప‌క్క‌న‌ పెట్టేశాయి. ప‌ర‌కాల‌లో ఇంత‌వ‌ర‌కూ ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెల‌వ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గం పుట్టినప్ప‌టి నుంచి ఆన‌వాయితీగా సెంటిమెంట్ వ‌స్తోంది. కొండా సురేఖ కూడా రెండోసారి ఉప […]

ఆ ఇద్ద‌రు సెంటిమెంట్‌ను గెలిచారు !
X

సెంటిమెంట్‌. రాజ‌కీయ నాయ‌కుల‌కు ఒక‌సారి ఆ సెంటిమెంట్ ఏర్ప‌డితే వ‌దల‌డం చాలా క‌ష్టం. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అలాగే సెంటిమెంట్ ఏర్ప‌డింది. అందులో ఒక‌టి ప‌ర‌కాల‌. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పుట్టిన‌ప్ప‌టి నుంచి ఈ సెంటిమెంట్ నిజ‌మైంది. కానీ ఈ సారి ఎన్నిక‌లు సెంటిమెంట్‌ను ప‌క్క‌న‌ పెట్టేశాయి.

ప‌ర‌కాల‌లో ఇంత‌వ‌ర‌కూ ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెల‌వ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గం పుట్టినప్ప‌టి నుంచి ఆన‌వాయితీగా సెంటిమెంట్ వ‌స్తోంది. కొండా సురేఖ కూడా రెండోసారి ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అంత‌కుముందు ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా వ‌రుస‌గా రెండోసారి గెల‌వ‌లేదు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ధ‌ర్మారెడ్డి…ఈ ఎన్నిక‌ల్లో కూడా గెలిచి ఈ సెంటిమెంట్‌ను తిర‌గ‌రాశారు. కొండాసురేఖ‌పై 20వేల‌కు పైగా మెజార్టీ సాధించి త‌న స‌త్తా చాటారు.

ఈ సెంటిమెంట్ విష‌యం తెలిసిన‌ ధ‌ర్మారెడ్డి ఎన్నిక‌ల ముందు చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశారు.. ప‌ర‌కాల ప‌ట్ట‌ణానికి వాస్తు మార్పులు చేయించారు. ప‌ట్ట‌ణంలో బొడ్రాయిని పెట్టారు. ఈ వాస్తు మార్పుల‌తో త‌న విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని ఆయ‌న త‌లిచారు.

పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన నాటి నుంచి ఏ ఎమ్మెల్యే కూడా వ‌రుస‌గా రెండో సారి గెల‌వ‌లేదు. కానీ ఈ సారి ఎమ్మెల్యే మ‌నోహ‌ర్‌రెడ్డి రెండోసారి విజ‌యం సాధించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి చింత‌కుంట విజ‌య‌ర‌మ‌ణారావు పై 8వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.

First Published:  12 Dec 2018 1:05 AM GMT
Next Story