Telugu Global
NEWS

మీ మంత్రి చెప్పినట్లే బట్టలూడదీసి కొట్టారు కదా!

మనీ, మీడియా ఉంటే ఏమైనా చేయవచ్చనుకున్న చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శకునిలాంటి లగడపాటిని అడ్డుపెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. వేల కోట్లు బ్యాంకులకు ముంచేసిన లగడపాటి… ఎలాగైనా కాంగ్రెస్‌, టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చి లబ్ది పొందాలనుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా టీఆర్‌ఎస్‌కు సూచించానని లగడపాటే చెప్పారని ఇలాంటి బ్రోకరిజం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. లగడపాటి దొంగ సర్వేలను ఇకపై ప్రజలెవరూ […]

మీ మంత్రి చెప్పినట్లే బట్టలూడదీసి కొట్టారు కదా!
X

మనీ, మీడియా ఉంటే ఏమైనా చేయవచ్చనుకున్న చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శకునిలాంటి లగడపాటిని అడ్డుపెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. వేల కోట్లు బ్యాంకులకు ముంచేసిన లగడపాటి… ఎలాగైనా కాంగ్రెస్‌, టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చి లబ్ది పొందాలనుకున్నారని వ్యాఖ్యానించారు.

టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా టీఆర్‌ఎస్‌కు సూచించానని లగడపాటే చెప్పారని ఇలాంటి బ్రోకరిజం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. లగడపాటి దొంగ సర్వేలను ఇకపై ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కలిస్తే ప్రజలు బట్టలూడదీసి కొడుతారని అయ్యన్నపాత్రుడు ఇది వరకే చెప్పారని తెలంగాణ ప్రజలు అయ్యన్నపాత్రుడు చెప్పినట్టుగానే కాంగ్రెస్‌, టీడీపీకి బట్టలూడదీసి కొట్టారన్నారు. చంటోడిని ఇంట్లో కూర్చొబెడితే తెలంగాణ గెలుస్తుందని చంద్రబాబు భావించారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అమరావతిలో పప్పు చాలా ఆనందంగా ఉన్నాడన్నారు.

ఇక పప్పును చంద్రబాబు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అమ్ముకోవాల్సిందేనన్నారు. నందమూరి ఫ్యామిలీని రాజకీయంగా సమాధి చేసేందుకు చుండ్రు సుహాసినిని తీసుకొచ్చి.. నామినేషన్‌ పత్రాల్లో నందమూరి సుహాసిని వైఫ్‌ ఆఫ్ హరికృష్ట అని రాయించి దిగజారి రాజకీయం చేశారన్నారు. ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రాంలు చంద్రబాబు రాజకీయం గుర్తించారు కాబట్టే వారు ప్రచారానికి రాలేదన్నారు. హరికృష్ణ శవం వద్దే టీఆర్‌ఎస్‌తో పొత్తు చర్చలు జరిపిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. సుహాసినీ పరిస్థితి చూసి తమకే బాధేసిందన్నారు.

40 ఏళ్ల అనుభవం ఉందన్న చంద్రబాబుకు 40 అడుగుల గోతి తీసి రాజకీయంగా తెలంగాణ ప్రజలు పాతిపెట్టారన్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరిలో టీడీపీ చిత్తుచిత్తు అవడం చూసి ఆంధ్రా ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఏపీలో చంద్రబాబు ఆరాచక పాలన చూసి కడుపు మండే గ్రేటర్ పరిధిలోని సీమాంధ్ర ప్రజలు కూటమిని భారీ మోజారిటీతో ఓడించారని రోజా అభిప్రాయపడ్డారు.

లగడపాటిలాంటి శకునులను ఎంతమందిని తెచ్చుకున్నా చంద్రబాబు పాచికలు ఇక పారవన్నారు. వైఎస్ లేని కాంగ్రెస్ తల లేని మొండం లాంటిదన్నారు. అలాంటి వైఎస్‌ను అవమానించిన నేతలంతా ఇప్పుడు పుట్టగతులు లేకుండా పోయారన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన శిక్ష విధించారన్నారు. మీడియా, మనీ ఉంటే చాలు ఏమైనా చేయవచ్చనుకున్న చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పారన్నారు.

టీడీపీకి తాను జాతీయ అధ్యక్షుడిని అని చంద్రబాబు ప్రకటించుకున్న తర్వాత ఆ పార్టీ తెలంగాణలో 15 స్థానాల నుంచి రెండు స్థానాలకు పడిపోయిందన్నారు. మేకప్‌ వేసుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బయటకు రావాలన్నారు రోజా.

First Published:  12 Dec 2018 1:10 AM GMT
Next Story