Telugu Global
NEWS

కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి కావాలి: అసదుద్దీన్ ఓవైసీ

దేశాన్ని అభివృద్ది పథంలోకి నడిపించే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉంది…. అలాంటి నాయకుడు దేశానికి కావాలన్నారు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ దేశం కోరుకుంటుందన్నారు. ఆ లక్ష్యం దిశగానే తెలంగాణ సీఎం కేసీఆర్ పయనిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ను నేను దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా… ఆయనపై నమ్మకం ఉందని చెప్పారు. 2019 […]

కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి కావాలి: అసదుద్దీన్ ఓవైసీ
X

దేశాన్ని అభివృద్ది పథంలోకి నడిపించే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉంది…. అలాంటి నాయకుడు దేశానికి కావాలన్నారు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ దేశం కోరుకుంటుందన్నారు. ఆ లక్ష్యం దిశగానే తెలంగాణ సీఎం కేసీఆర్ పయనిస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ ను నేను దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా… ఆయనపై నమ్మకం ఉందని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ తో కలిసి నడవనున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.

First Published:  11 Dec 2018 9:23 PM GMT
Next Story