Telugu Global
National

మధ్యప్రదేశ్‌లో హైడ్రామా.... అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్.... తెర వెనుక బీజేపీ ప్రయత్నాలు

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. మధ్యప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. అయితే మధ్యప్రదేశ్‌లో ఓటర్ ఇచ్చిన తీర్పుతో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (116)ను అందుకోలేకపోయింది. కడపటి వార్తలు అందే సరికి కాంగ్రెస్ 114, బీజేపీ 109, బీఎస్పీ 2, ఇతరులు 5 సీట్లు గెల్చుకున్నారు. ఒక అసెంబ్లీ స్థానం కౌంటింగ్  ఇంకా కొనసాగుతోంది. అయితే గత రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలు […]

మధ్యప్రదేశ్‌లో హైడ్రామా.... అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్.... తెర వెనుక బీజేపీ ప్రయత్నాలు
X

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. మధ్యప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. అయితే మధ్యప్రదేశ్‌లో ఓటర్ ఇచ్చిన తీర్పుతో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (116)ను అందుకోలేకపోయింది.

కడపటి వార్తలు అందే సరికి కాంగ్రెస్ 114, బీజేపీ 109, బీఎస్పీ 2, ఇతరులు 5 సీట్లు గెల్చుకున్నారు. ఒక అసెంబ్లీ స్థానం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అయితే గత రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్‌ ఆనందీ బెన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, ఎన్నికల సంఘం నుంచి నివేదిక వచ్చే వరకు నేను ఎవరినీ పిలవను అని గవర్నర్ స్పష్టం చేశారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చావు దెబ్బ తిన్నది. రాజస్థాన్, చత్తీస్‌గడ్‌లో అధికారం కోల్పోయింది. దీంతో బీజేపీ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవడానికి సిద్దంగా లేదు. ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తెరవెనుక ప్రయత్నాలు మొదలు పెట్టింది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ గత అర్థరాత్రి సీనియర్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. బీఎస్పీ, ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకుంటే అధికారం సాధ్యమే కనుక ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ గవర్నర్ ఆనందీబెన్ గతంలో బీజేపీ తరపున గుజరాత్ సీఎంగా పని చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ ద్వారా బీజేపీ కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురు స్వతంత్రులు మా పార్టీకి చెందిన వారేనని…. వాళ్ల సపోర్ట్‌తో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని అంటున్నారు.

కమల్‌నాథ్, జ్యోతిరాధిత్య సింథియా, దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ కూడా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఎలాగైనా మధ్యప్రదేశ్ చేజారి పోకుండా ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది.

అతి పెద్ద పార్టీగా ఏర్పడిన కాంగ్రెస్‌ను పిలవకుండా…. బీజేపీని పిలిస్తే గవర్నర్ విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో ఇవాళ మధ్యాహ్నం లోపు స్పష్టమవుతుంది.

First Published:  11 Dec 2018 10:52 PM GMT
Next Story