Telugu Global
NEWS

తూచ్‌.... నేనొప్పుకోను " వీహెచ్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సునామీని చూసి కాంగ్రెస్‌ సీనియర్లు సైతం కంగుతిన్నారు. హేమాహేమీలు మట్టి కరిచారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పిన వీహెచ్‌… టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఫలితాలపై ఆశ్చర్యం, ఆక్రోశం వెళ్ళగక్కారు. ఇదంతా మోసం అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్ చేశారని ఆరోపించారు. చేతి గుర్తుకు వేసిన ఓట్లు కారుకు పడ్డాయని చెప్పుకొచ్చారు. బీజేపీతో కలిసి కేసీఆర్‌ ఈవీఎంలను మేనేజ్ చేశారన్నారు. ప్రజల్లో తిరగని కేసీఆర్‌కు ఇన్ని ఓట్లు ఎలా వస్తాయని వీహెచ్ ప్రశ్నించారు. దేనినైనా మేనేజ్ చేయడంలో […]

తూచ్‌.... నేనొప్పుకోను  వీహెచ్‌
X

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సునామీని చూసి కాంగ్రెస్‌ సీనియర్లు సైతం కంగుతిన్నారు. హేమాహేమీలు మట్టి కరిచారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పిన వీహెచ్‌… టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఫలితాలపై ఆశ్చర్యం, ఆక్రోశం వెళ్ళగక్కారు. ఇదంతా మోసం అని వ్యాఖ్యానించారు.

ఈవీఎంలను మేనేజ్ చేశారని ఆరోపించారు. చేతి గుర్తుకు వేసిన ఓట్లు కారుకు పడ్డాయని చెప్పుకొచ్చారు. బీజేపీతో కలిసి కేసీఆర్‌ ఈవీఎంలను మేనేజ్ చేశారన్నారు.

ప్రజల్లో తిరగని కేసీఆర్‌కు ఇన్ని ఓట్లు ఎలా వస్తాయని వీహెచ్ ప్రశ్నించారు. దేనినైనా మేనేజ్ చేయడంలో కేసీఆర్ దిట్ట అని వీహెచ్ ఆరోపించారు.

ఒకవేళ నిజంగా బీజేపీ వాళ్లు ఈవీఎంలను మేనేజ్ చేసే పరిస్థితే ఉంటే రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోతుంది అన్నది కొందరి ప్రశ్న.

First Published:  11 Dec 2018 12:49 AM GMT
Next Story