Telugu Global
NEWS

ఉత్తమ్ సంచలన ఆరోపణలు.... చరిత్రలో ఇది బ్లాక్‌ డే

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నిరాకరించారు. దురదృష్టవ శాత్తు ఎన్నికల కమిషన్‌ కూడా కేసీఆర్‌తో కుమ్మక్కు అయిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలున్నాయన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ పైనే తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాలోనూ అనేక అక్రమాలున్నాయన్నారు. దీనిపై ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసీ అధికారులు క్షమాపణలు కూడా చెప్పారన్నారు. ఈవీఎంలు పూర్తిగా ట్యాపంరింగ్ అయ్యాయన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా మిగిలిపోతుందన్నారు. దీనిపై కేంద్ర […]

ఉత్తమ్ సంచలన ఆరోపణలు.... చరిత్రలో ఇది బ్లాక్‌ డే
X

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నిరాకరించారు. దురదృష్టవ శాత్తు ఎన్నికల కమిషన్‌ కూడా కేసీఆర్‌తో కుమ్మక్కు అయిందని ఆరోపించారు.

ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలున్నాయన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ పైనే తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాలోనూ అనేక అక్రమాలున్నాయన్నారు. దీనిపై ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసీ అధికారులు క్షమాపణలు కూడా చెప్పారన్నారు.

ఈవీఎంలు పూర్తిగా ట్యాపంరింగ్ అయ్యాయన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా మిగిలిపోతుందన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ అనుమానాలు తొలగించేందుకు వీవీ ప్యాట్‌ స్లిప్‌లను మొత్తం లెక్కించాలని డిమాండ్ చేశారు. అనేక బూతుల్లో జరిగిన ఓటింగ్ సరళికి… ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు.

ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ 440 ఓట్లతో ఓడిపోయారని ప్రకటించారని… అక్కడ కూడా వీవీ ప్యాట్‌ స్లిప్పు లను లెక్కించాలని డిమాండ్ చేసినా ఆ పని చేయడం లేదన్నారు. పేపర్ స్లిప్‌లను లెక్కించని పక్షంలో తెలంగాణ చరిత్రలో ఈరోజు బ్లాక్ డేగా మిగిలిపోతుందన్నారు.

తెలంగాణలో ఈ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ వాదులు రాజస్థాన్ లో, చత్తీస్ ఘడ్ లో , మధ్యప్రదేశ్ లో ఈవీఎంల పైన ఏం మాట్లాడతారని విలేకరులు ప్రశ్నించగా నేను తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడతానని ఉత్తమ్ తప్పుకున్నారు.

First Published:  11 Dec 2018 4:45 AM GMT
Next Story