Telugu Global
NEWS

గన్‌ పట్టిన ప్రొఫైల్ పిక్.... కేటీఆర్‌ సమాధానం ఇది!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకొని పోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద సంబురాలు మొదలయ్యాయి. మరో వైపు ఏ సందర్భంలో అయినా ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్.. టీఆర్ఎస్ విజయం పట్ల కూడా వినూత్నంగా స్పందించారు. గన్ పెట్టుకొని ఉన్న ఇమేజ్‌ను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నారు. ప్రతిపక్షాలను ఈ విజయంతో పేల్చేశాం అనే సింబాలిక్‌గా ఈ ప్రొఫైల్ […]

గన్‌ పట్టిన ప్రొఫైల్ పిక్.... కేటీఆర్‌ సమాధానం ఇది!
X

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకొని పోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద సంబురాలు మొదలయ్యాయి.

మరో వైపు ఏ సందర్భంలో అయినా ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్.. టీఆర్ఎస్ విజయం పట్ల కూడా వినూత్నంగా స్పందించారు. గన్ పెట్టుకొని ఉన్న ఇమేజ్‌ను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నారు.

ప్రతిపక్షాలను ఈ విజయంతో పేల్చేశాం అనే సింబాలిక్‌గా ఈ ప్రొఫైల్ పిక్ పెట్టరు. అంతే కాకుండా న్యూ ప్రొఫైల్ పిక్ అనే ట్యాగ్ జత చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది.

ఇక సిరిసిల్లలో కేసీఆర్ భారీ ఆధిక్యం దిశగా దూసుకొని పోతున్నారు.

First Published:  10 Dec 2018 11:39 PM GMT
Next Story