Telugu Global
National

ఉత్తరాదిలో కాంగ్రెస్ హవా

మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యత ప్రదర్శిస్తోంది కాంగ్రెస్‌. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు (మొత్తం 200, ఒకదాంట్లో వాయిదా పడింది) ఎన్నికలు జరుగగా ప్రస్తుతం కాంగ్రెస్ 101 స్థానాల్లో, బీజేపీ 80 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు […]

ఉత్తరాదిలో కాంగ్రెస్ హవా
X

మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యత ప్రదర్శిస్తోంది కాంగ్రెస్‌.

రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు (మొత్తం 200, ఒకదాంట్లో వాయిదా పడింది) ఎన్నికలు జరుగగా ప్రస్తుతం కాంగ్రెస్ 101 స్థానాల్లో, బీజేపీ 80 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 101 స్థానాలు అవసరమవుతాయి. వసుంధర రాజే ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది.

ఇక మధ్యప్రదేశ్‌లో స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకొని పోతోంది. ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 117, బీజేపీ 101, బీఎస్పీ 6 స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తున్నాయి.

చత్తీస్‌ఘడ్‌లో కూడా రమణ్‌సింగ్ ప్రభుత్వం ప్రతికూల ఫలితాలు చవిచూస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 59, బీజేపీ 22, బీఎస్పీ 2, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

అయితే హంగ్ ఏర్పడుతుంది అనుకున్న మీజోరాంలో కాంగ్రెస్ తమ అధికారాన్ని కోల్పోనుంది. ఇక్కడ ఎంఎన్ఎఫ్ 29, కాంగ్రెస్ 8, బీజేపీ మిత్ర పక్షాలు 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముందు మూడు బీజేపీ రాష్ట్రాలు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లడం మోడీ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ కావచ్చు.

First Published:  11 Dec 2018 12:29 AM GMT
Next Story