దేవరకొండపై కన్నేసిన కరణ్ జోహార్
విజయ్ దేవరకొండ ఎవరో కరణ్ జోహార్ కు తెలియాల్సిన అవసరం లేదు. ఇతడు టాలీవుడ్ లో మాత్రమే సెన్సేషన్. ఇతడు నటించిన సినిమాలేవీ బాలీవుడ్ లో ఆడలేదు. అర్జున్ రెడ్డి మాత్రం హిందీలో రీమేక్ అవుతోందంతే. అలాంటి విజయ్ దేవరకొండపై కరణ్ జోహార్ ఫోకస్ పెట్టాడు. వీలైతే విజయ్ ను బాలీవుడ్ కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు కరణ్. విజయ్ దేవరకొండపై కరణ్ జోహార్ దృష్టి పడ్డానికి కారణం జాన్వి కపూర్. కాఫీ విద్ కరణ్ […]
BY admin10 Dec 2018 11:00 PM GMT

X
admin Updated On: 10 Dec 2018 11:00 PM GMT
విజయ్ దేవరకొండ ఎవరో కరణ్ జోహార్ కు తెలియాల్సిన అవసరం లేదు. ఇతడు టాలీవుడ్ లో మాత్రమే సెన్సేషన్. ఇతడు నటించిన సినిమాలేవీ బాలీవుడ్ లో ఆడలేదు. అర్జున్ రెడ్డి మాత్రం హిందీలో రీమేక్ అవుతోందంతే. అలాంటి విజయ్ దేవరకొండపై కరణ్ జోహార్ ఫోకస్ పెట్టాడు. వీలైతే విజయ్ ను బాలీవుడ్ కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు కరణ్.
విజయ్ దేవరకొండపై కరణ్ జోహార్ దృష్టి పడ్డానికి కారణం జాన్వి కపూర్. కాఫీ విద్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించింది జాన్వి. తను అబ్బాయిగా పుడితే విజయ్ దేవరకొండగా పుడతానని, అతడి యాటిట్యూడ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది జాన్వి. అప్పట్నుంచి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు దేవరకొండ. కరణ్ జోహార్ ను ఎట్రాక్ట్ చేసింది కూడా ఇక్కడే.
ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ మధ్య చర్చలైతే జరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లో దేవరకొండ ఇప్పటికిప్పుడు సినిమా చేస్తాడా అనేది సందేహం. ఎందుకంటే ప్రస్తుతం ఇతడి చేతిలో 2 సినిమాలున్నాయి. మరో 4 అడ్వాన్సులు కూడా ఉన్నాయి. తెలుగులో ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాత మాత్రమే బాలీవుడ్ వైపు చూడగలడు విజయ్ దేవరకొండ
Next Story