Telugu Global
NEWS

కాంగ్రెస్ ను ముంచింది బాబేనా?

తెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో కాకుండా ఒంట‌రిగా పోటి చేసి ఉంటే మంచి ఫ‌లితాలు వ‌చ్చి ఉండేవ‌నే అభిప్రాయం కాంగ్రెస్ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. వాస్త‌వానికి తెలంగాణాలో టి.ఆర్‌.ఎస్‌.కు ప్ర‌త్యామ్నాయం ఇవ్వ‌గ‌లిగిన శ‌క్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంద‌న్న అభిప్రాయం ఉంది. బిజెపి ఉన్న‌ప్ప‌టికీ అనుకున్న స్థాయిలో అది ఎద‌గ‌లేక‌పోయింది. కాంగ్రెస్ కు అనుకూల వాతావర‌ణం ఉంది. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్. కాబ‌ట్టి తెలంగాణాలో మాట్లాడే అధికారం, అక్క‌డ అధికారం కోరుకునే హ‌క్కు కాంగ్రెస్‌కు ఉంది. కానీ అనుకోని రీతిలో […]

కాంగ్రెస్ ను ముంచింది బాబేనా?
X

తెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో కాకుండా ఒంట‌రిగా పోటి చేసి ఉంటే మంచి ఫ‌లితాలు వ‌చ్చి ఉండేవ‌నే అభిప్రాయం కాంగ్రెస్ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. వాస్త‌వానికి తెలంగాణాలో టి.ఆర్‌.ఎస్‌.కు ప్ర‌త్యామ్నాయం ఇవ్వ‌గ‌లిగిన శ‌క్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంద‌న్న అభిప్రాయం ఉంది.

బిజెపి ఉన్న‌ప్ప‌టికీ అనుకున్న స్థాయిలో అది ఎద‌గ‌లేక‌పోయింది. కాంగ్రెస్ కు అనుకూల వాతావర‌ణం ఉంది. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్. కాబ‌ట్టి తెలంగాణాలో మాట్లాడే అధికారం, అక్క‌డ అధికారం కోరుకునే హ‌క్కు కాంగ్రెస్‌కు ఉంది. కానీ అనుకోని రీతిలో ఏర్ప‌డిన ప్ర‌జాకూట‌మి వ‌ల్ల కాంగ్రెస్ న‌ష్ట‌పోయింది.

దీనికి తోడు టిడిపిని క‌లుపుకోవ‌డం మ‌రింత న‌ష్టం. తెలంగాణా ప్ర‌జ‌ల్లో రాష్ర్ట సెంటిమెంట్ ఉంది. దాన్ని ఎప్ప‌టిక‌పుడు రిఫ్రెష్ చేసుకుంటూ, తెలంగాణ సెంటిమెంటును చ‌ల్లార‌కుండా కెసీఆర్ రాజేస్తూనే ఉన్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌ట్టించుకోకండా చంద్ర‌బాబు వెళ్ల‌డం స‌రైన చ‌ర్య‌కాదు.

చంద్రబాబును ఆంధ్రా సి.ఎం.గానే భావిస్తున్నారు. రాష్ర్ట విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత చంద్ర‌బాబును తెలంగాణ ప్ర‌జ‌లు ఏమాత్రం ఆద‌రించే స్థితిలో లేరు. దీన్ని కాంగ్రెస్ అంచ‌నా వేయ‌లేక‌పోయింది. చంద్ర‌బాబును ప్ర‌చారానికి వాడ‌కుండా, రాహుల్ గాంధీతో క‌లిసి ప్ర‌చారం చేసుకొని ఉంటే మంచి ఫ‌లితాలు వ‌చ్చి ఉండేవి.

ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించుకొనే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ నాయ‌క‌త్వం చేతులారా బాబును క‌లుపుకొని న‌ష్ట‌పోయిందని కాంగ్రెస్‌ వాదులు లబోదిబోమంటున్నారు.

First Published:  11 Dec 2018 8:16 AM GMT
Next Story