Telugu Global
NEWS

నవీన్ నిశ్చల్‌ను తొలగించిన వైసీపీ

చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పట్టుకోసం వైసీపీ పావులు కదుపులోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న నవీన్‌ నిశ్చల్‌ను పక్కన పెట్టింది. రెండు రోజుల క్రితం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అబ్దుల్‌ ఘనిని ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్‌ నిశ్చల్‌ స్థానంలో అబ్దుల్ ఘని ఇకపై నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతారని వెల్లడించింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా ఉంటూ వచ్చిన నవీన్‌ […]

నవీన్ నిశ్చల్‌ను తొలగించిన వైసీపీ
X

చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పట్టుకోసం వైసీపీ పావులు కదుపులోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న నవీన్‌ నిశ్చల్‌ను పక్కన పెట్టింది.

రెండు రోజుల క్రితం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అబ్దుల్‌ ఘనిని ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్‌ నిశ్చల్‌ స్థానంలో అబ్దుల్ ఘని ఇకపై నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతారని వెల్లడించింది.

ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా ఉంటూ వచ్చిన నవీన్‌ నిశ్చల్‌కు అధికారంలోకి వచ్చాక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం తెలుస్తోంది. అయితే ఇన్‌చార్జ్ పదవి నుంచి తనను తొలగించి…. రెండు రోజుల క్రితమే పార్టీలోకి వచ్చిన అబ్దుల్ ఘనిని ఇన్‌చార్జ్‌గా నియమించడంపై నిశ్చల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  9 Dec 2018 11:39 PM GMT
Next Story