Telugu Global
NEWS

ఈసారికి క్షమిస్తున్నా.... మరోసారి చేస్తే పరువు నష్టం దావా

టీఆర్‌ఎస్ నాగర్‌ కర్నూలు అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఫిరాయింపు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. తనపై మర్రి జనార్దన్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈసారికి మాత్రం క్షమిస్తున్నానన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఎన్నికల పోరు చాలా హోరాహోరీగా ఉందన్నారు. తన ఫోన్‌ నెంబర్‌ను మర్రి జనార్దన్‌ రెడ్డి మీడియాలో చూపించడం వల్ల ఆ నెంబర్‌కు అనేక ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. […]

ఈసారికి క్షమిస్తున్నా.... మరోసారి చేస్తే పరువు నష్టం దావా
X

టీఆర్‌ఎస్ నాగర్‌ కర్నూలు అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఫిరాయింపు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. తనపై మర్రి జనార్దన్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈసారికి మాత్రం క్షమిస్తున్నానన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఎన్నికల పోరు చాలా హోరాహోరీగా ఉందన్నారు.

తన ఫోన్‌ నెంబర్‌ను మర్రి జనార్దన్‌ రెడ్డి మీడియాలో చూపించడం వల్ల ఆ నెంబర్‌కు అనేక ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. దాని వల్ల తనకు చాలా ఇబ్బంది అవుతోందన్నారు. అందుకే మర్రి జనార్దన్‌ రెడ్డి నెంబర్లను కూడా మీడియాలో చూపించాలంటూ మర్రి జనార్దన్‌ రెడ్డికి చెందిన ఫోన్‌ నెంబర్లను మీడియా ముందు విశ్వేశ్వరరెడ్డి ప్రదర్శించారు.

తన నెంబర్‌కు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టవద్దని విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫోన్‌ చేసి ఎన్నికల ఫలితాలపై ఆరా తీశానన్నారు. అందుకు మించి ఏమీ మాట్లాడలేదన్నారు. మర్రి జనార్దన్‌ రెడ్డి తన మిత్రుడేనని ఈసారికి క్షమించి వదిలేస్తున్నానన్నారు. మరోసారి ఇలాగే ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా తప్పదని హెచ్చరించారు.

First Published:  10 Dec 2018 7:23 AM GMT
Next Story