Telugu Global
NEWS

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.... వెలుగులోకి సంచలన ఆడియో టేపు.... అడ్డంగా దొరికిన విశ్వేశ్వర్‌ రెడ్డి

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు కొద్ది గంటల ముందు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉన్న వారిని గుర్తించి వారిని కోనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి … టీఆర్‌ఎస్ నాగర్‌ కర్నూలు అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డికి ఫోన్ చేశారు. జానారెడ్డి ఇంటికి రండి మాట్లాడుకుందామని ఫోన్‌లో చెప్పారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే మర్రి జనార్దన్‌ […]

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.... వెలుగులోకి సంచలన ఆడియో టేపు.... అడ్డంగా దొరికిన విశ్వేశ్వర్‌ రెడ్డి
X

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు కొద్ది గంటల ముందు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉన్న వారిని గుర్తించి వారిని కోనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి … టీఆర్‌ఎస్ నాగర్‌ కర్నూలు అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డికి ఫోన్ చేశారు.

జానారెడ్డి ఇంటికి రండి మాట్లాడుకుందామని ఫోన్‌లో చెప్పారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే మర్రి జనార్దన్‌ రెడ్డి అందుకు అంగీకరించలేదు. విశ్వేశ్వర్‌ రెడ్డి తనను ప్రలోభపెట్టేందుకు చేసిన ఫోన్ కాల్ ఆడియో టేపును మర్రి జనార్దన్ రెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు.

రెండుసార్లు విశ్వేశ్వర్‌ రెడ్డి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు మర్రి జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని చెప్పారు. 94908 61960 నెంబర్‌ నుంచి మధ్యాహ్నం 2.07 నిమిషాలకు, మరో కాల్‌ మధ్యాహ్నం 2. 56 నిమిషాలకు వచ్చిందని వెల్లడించారు. సదరు ఆడియో టేపులను మీడియా ముందు జనార్దన్ రెడ్డి వినిపించారు.

టీఆర్ఎస్ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని… మహాకూటమి నేతలు నీచ రాజకీయాలు మానుకోవాలని మర్రి జనార్దన్‌ రెడ్డి సూచించారు. ఇలాంటి ప్రలోభాలను మహాకూటమి నేతలు వెంటనే ఆపేయాలని హెచ్చరించారు.

ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని టీఆర్‌ఎస్ నేతలు మీడియా ముందు ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కర్నాటకకు చెందిన శివకుమార్ రాత్రికి హైదరాబాద్‌ రాబోతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. వందల కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్‌, చంద్రబాబు నీచ రాజకీయాలకు దిగజారుతున్నారని టీఆర్‌ఎస్ మండిపడుతోంది.

First Published:  10 Dec 2018 5:59 AM GMT
Next Story