Telugu Global
National

రంగంలోకి దిగిన డీకే శివకుమార్.... కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్రం సహా ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత గాని పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం లేదు. అయితే గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేల్కొన్నది. ఇప్పటికే గవర్నర్‌ వద్దకు కూటమి నేతలతో సహా వెళ్లి మా నాలుగు పార్టీలు కలిసే పోటీ చేశాయి కనుక.. రేపు హంగ్ వస్తే మాకే ముందు అవకాశం ఇవ్వమని కోరాయి. ఇక ఈ దఫా నలుగురైదుగురు స్వతంత్ర, […]

రంగంలోకి దిగిన డీకే శివకుమార్.... కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం
X

తెలంగాణ రాష్ట్రం సహా ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత గాని పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం లేదు. అయితే గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేల్కొన్నది. ఇప్పటికే గవర్నర్‌ వద్దకు కూటమి నేతలతో సహా వెళ్లి మా నాలుగు పార్టీలు కలిసే పోటీ చేశాయి కనుక.. రేపు హంగ్ వస్తే మాకే ముందు అవకాశం ఇవ్వమని కోరాయి.

ఇక ఈ దఫా నలుగురైదుగురు స్వతంత్ర, రెబెల్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ముగిశాక చేసిన విశ్లేషణలో కూడా ఎవరు గెలిచే అభ్యర్థులో ఇప్పటికే గుర్తించింది. దీంతో వారిని తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తోంది.

టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా…. మహాకూటమిలోనే వాళ్లు ఉండేలా క్యాంపు రాజకీయాలకు నాంది పలికింది. క్యాంపు రాజకీయాలు నిర్వహించడంలో అనుభవజ్ఞుడిగా పేరు పొందిన కర్నాటక మంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. గెలవబోయే రెబెల్స్, స్వతంత్రులతో ఆయన టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి నేతలతో కూడా దీనిపై చర్చించారని సమాచారం.

ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని రక్షించడానికి శివకుమార్ చేసిన క్యాంపు రాజకీయం చాలా కీలకమైనదే. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితే ఉత్పన్న అయితే శివకుమార్ అయితే చాణక్యంగా వ్యవహరిస్తాడనే ఉద్దేశంతో అధిష్టానం ఆయనను రంగంలోకి దింపింది.

రేపు తుది ఫలితం వెలువడిన వెంటనే…. పరిస్థితులను బట్టి ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు స్వతంత్రులు లొంగకుండా చాకచక్యంగా వ్యవహరించాలంటే శివకుమారే కరెక్ట్ అని మహాకూటమి నేతలు భావిస్తున్నారు. మరి క్యాంపు రాజకీయాలు అవసరం అవుతాయా లేదా అన్నది రేపు తెలిసిపోనుంది.

First Published:  10 Dec 2018 5:57 AM GMT
Next Story