Telugu Global
National

ఒడిషాలో పోటీకి నిర్ణయం

జాతీయ పార్టీగా తనకు తాను ప్రకటించుకున్న టీడీపీ… మరో అడుగు ముందుకేసింది. పక్క రాష్ట్రాల్లోనూ పోటీకి సిద్దమవుతోంది. ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ తన ప్రకాశాన్ని కోల్పోయి పొత్తులో భాగంగా 13 సీట్లతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ పక్క రాష్ట్రాల్లోకి విస్తరించడం ఆపబోమని టీడీపీ చెబుతోంది. వచ్చే ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఒడిశాలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తామని ఒడిషా టీడీపీ అధ్యక్షుడు రాజేశ్‌ పుత్ర […]

ఒడిషాలో పోటీకి నిర్ణయం
X

జాతీయ పార్టీగా తనకు తాను ప్రకటించుకున్న టీడీపీ… మరో అడుగు ముందుకేసింది. పక్క రాష్ట్రాల్లోనూ పోటీకి సిద్దమవుతోంది. ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ తన ప్రకాశాన్ని కోల్పోయి పొత్తులో భాగంగా 13 సీట్లతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ పక్క రాష్ట్రాల్లోకి విస్తరించడం ఆపబోమని టీడీపీ చెబుతోంది.

వచ్చే ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఒడిశాలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తామని ఒడిషా టీడీపీ అధ్యక్షుడు రాజేశ్‌ పుత్ర వెల్లడించారు. 147 స్థానాలున్న అసెంబ్లీలో 50 స్థానాలకు పోటీ చేస్తామని తెలిపారు. ఐదు లోక్‌సభ స్థానాల్లోనూ టీడీపీ బరిలో దిగుతుందన్నారు.

కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారని ఆయా జిల్లాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందన్నారు. అభ్యర్థులెవరన్న విషయంపై త్వరలోనే సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

First Published:  8 Dec 2018 10:14 PM GMT
Next Story