Telugu Global
Cinema & Entertainment

తక్కువ టైమ్ లో ఎక్కువ అవుట్ పుట్

అంతరిక్షం సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. కంప్లీట్ గ్రాఫిక్స్ తో కూడుకున్న ఈ సినిమాను చాలా తక్కువ టైమ్ లో పూర్తిచేశారు. అలా అని మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. తెలుగులో మొట్టమొదటి స్పేస్ మూవీ అంతరిక్షం ట్రయిలర్ రిలీజైంది. గతంలో ఘాజీ లాంటి సినిమా తీసి హిట్ కొట్టిన సంకల్ప్ రెడ్డి, తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రయిలర్ ఆకట్టుకునేలా ఉంది. […]

తక్కువ టైమ్ లో ఎక్కువ అవుట్ పుట్
X

అంతరిక్షం సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. కంప్లీట్ గ్రాఫిక్స్ తో కూడుకున్న ఈ సినిమాను చాలా తక్కువ టైమ్ లో పూర్తిచేశారు. అలా అని మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది.

తెలుగులో మొట్టమొదటి స్పేస్ మూవీ అంతరిక్షం ట్రయిలర్ రిలీజైంది. గతంలో ఘాజీ లాంటి సినిమా తీసి హిట్ కొట్టిన సంకల్ప్ రెడ్డి, తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రయిలర్ ఆకట్టుకునేలా ఉంది. అంతరిక్షం నేపథ్యంలో థ్రిల్ ఎలిమెంట్స్ జోడించారనే విషయం ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది.

సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా అదితిరావ్ హైదరి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

First Published:  9 Dec 2018 5:05 AM GMT
Next Story