Telugu Global
Cinema & Entertainment

లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కీర్తీ సురేష్

కీర్తి సురేష్ కి “మహానటి” సినిమాతో సౌత్ మొత్తం లో మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తెలుగు తో పాటు తమిళ్ లో కూడా రూపొంది మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తరువాత తెలుగు లో కీర్తి సురేష్ కి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి, కానీ కీర్తి సురేష్ ఒక్క ఆఫర్ కూడా సైన్ చెయ్యకుండా తమిళ్ లో సినిమాలు చేస్తూ వచ్చింది. కీర్తి సురేష్ తమిళంలో చేసిన “పందెం […]

లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కీర్తీ సురేష్
X

కీర్తి సురేష్ కి “మహానటి” సినిమాతో సౌత్ మొత్తం లో మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తెలుగు తో పాటు తమిళ్ లో కూడా రూపొంది మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తరువాత తెలుగు లో కీర్తి సురేష్ కి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి, కానీ కీర్తి సురేష్ ఒక్క ఆఫర్ కూడా సైన్ చెయ్యకుండా తమిళ్ లో సినిమాలు చేస్తూ వచ్చింది. కీర్తి సురేష్ తమిళంలో చేసిన “పందెం కోడి 2” “సర్కార్” అక్కడ భారీ విజయాలను తెచ్చిపెట్టాయి. తెలుగులోనూ ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి.

కానీ “మహానటి” తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన కథలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయట. అయితే కొంతకాలం పాటు హీరోలతో జోడి కట్టే పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న కీర్తి సురేశ్, ఇటివలే లేడీ ఓరియెంటెడ్ కలిగిన ఒక కథను చేయడానికి మాత్రం ఒప్పుకుందట.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా తెలుగులో రూపొందనుంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయంతో పాటు, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తారు నిర్మాతలు.

First Published:  7 Dec 2018 11:26 PM GMT
Next Story