Telugu Global
NEWS

చత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

చత్తీస్‌గఢ్‌లో బీజేపీదే తిరిగి అధికారం అంటోంది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ సర్వే. రాజస్థాన్ లో మాత్రం బీజేపీ ఓటమి ఖాయమని తేల్చింది. చత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా… బీజేపీకి 46, కాంగ్రెస్‌కు 35, ఇతరులకు ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ చెబుతోంది. చత్తీస్ గఢ్‌ లో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు… బీజేపీ 21నుంచి 31, కాంగ్రెస్ 55 నుంచి 65 స్థానాలను చత్తీస్‌గఢ్‌లో సొంతం చేసుకునే అవకాశం […]

చత్తీస్‌గఢ్‌లో బీజేపీదే తిరిగి అధికారం అంటోంది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ సర్వే. రాజస్థాన్ లో మాత్రం బీజేపీ ఓటమి ఖాయమని తేల్చింది.

చత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా… బీజేపీకి 46, కాంగ్రెస్‌కు 35, ఇతరులకు ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ చెబుతోంది.

చత్తీస్ గఢ్‌ లో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

బీజేపీ 21నుంచి 31, కాంగ్రెస్ 55 నుంచి 65 స్థానాలను చత్తీస్‌గఢ్‌లో సొంతం చేసుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది.


రాజస్థాన్‌

రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్‌ పై చేయి సాధించిందని టైమ్స్‌ నౌ చెబుతోంది. ఇక్కడ బీజేపీకి 85 స్థానాలు, కాంగ్రెస్‌కు 105, బీఎస్పీకి రెండు, ఇతరులకు ఏడు స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడించింది.

రిపబ్లిక్ జన్‌ కీ బాత్‌ సర్వే మాత్రం రాజస్థాన్‌లో పోరు హోరాహోరీగానే నడిచిందంటోంది.. ఈ సర్వే ప్రకారం
బీజేపీకి 83 నుంచి 103, కాంగ్రెస్‌కు 81 నుంచి 101, ఇతరులు 15 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

రాజస్థాన్‌ లో ఇండియా టుడే సర్వే

బీజేపీకి 55- 72
కాంగ్రెస్‌కు 119 నుంచి 141 స్థానాలు గెలిచే అవకాశం ఉంది.

First Published:  7 Dec 2018 6:51 AM GMT
Next Story