Telugu Global
NEWS

పంచాయతీ ఎన్నికలకు ఏపీ నో.... కోర్టులో పిటిషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు ఏపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. ఆగస్టులోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగియగా… వారి స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన తీసుకొచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు… మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇది వరకే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ అడ్వకేట్ జనరల్‌ దమ్మలపాటి శ్రీనివాస్ […]

పంచాయతీ ఎన్నికలకు ఏపీ నో.... కోర్టులో పిటిషన్‌
X

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు ఏపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. ఆగస్టులోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగియగా… వారి స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన తీసుకొచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు… మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇది వరకే ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ అడ్వకేట్ జనరల్‌ దమ్మలపాటి శ్రీనివాస్ ఈ పిటిషన్‌ వేశారు.

బీసీ ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశంపై గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండానే సింగిల్‌ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీసీ రిజర్వేషన్లు తేల్చేందుకు సమయం పడుతుందని… కాబట్టి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను సవరించాలని కోర్టును కోరారు.ఈ పిటిషన్‌ను డిసెంబర్ 19న విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.

First Published:  6 Dec 2018 11:54 PM GMT
Next Story