Telugu Global
NEWS

మీడియా అధినేతలు మోసం చేశారు....

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ మీడియాను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తమకు మిత్రులెవరో, శత్రువులెవరో తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. రెండు పత్రికలు హఠాత్తుగా ఎన్నికల వేళ రంగులు మార్చేశాయని ఆరోపించారు. సదరు పత్రికాధినేతలు, చంద్రబాబు కలిసి లగడపాటిపై ఒత్తిడి తెచ్చి మహాకూటమి హవా ఉన్నట్టుగా ప్రచారం చేయించారని కేటీఆర్ విమర్శించారు. నవంబర్‌ 20 నాడు చేసిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని లగడపాటి చెప్పారన్నారు. ఆతర్వాత ఎలాంటి సర్వే చేయలేదని […]

మీడియా అధినేతలు మోసం చేశారు....
X

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ మీడియాను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తమకు మిత్రులెవరో, శత్రువులెవరో తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. రెండు పత్రికలు హఠాత్తుగా ఎన్నికల వేళ రంగులు మార్చేశాయని ఆరోపించారు.

సదరు పత్రికాధినేతలు, చంద్రబాబు కలిసి లగడపాటిపై ఒత్తిడి తెచ్చి మహాకూటమి హవా ఉన్నట్టుగా ప్రచారం చేయించారని కేటీఆర్ విమర్శించారు.

నవంబర్‌ 20 నాడు చేసిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని లగడపాటి చెప్పారన్నారు. ఆతర్వాత ఎలాంటి సర్వే చేయలేదని లగడపాటే స్వయంగా ఒప్పుకున్నారని… మరి సర్వే చేయకుండానే మహాకూటమి పుంజుకుందని ఎలా చెప్పారని ప్రశ్నించారు.

మిత్రులెవరో, శత్రువులెవరో తెలిసిపోయిందని, ఆకస్మాత్తుగా పేపర్లు రంగులు మార్చేశాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసే సమయంలోనూ సదరు మీడియా సంస్థలు టీడీపీతోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ మీడియా సంస్థల అధిపతులు ఎవరన్నది ఈనెల 11న చెబుతానని కేటీఆర్‌ వెల్లడించారు.

First Published:  5 Dec 2018 9:14 PM GMT
Next Story