Telugu Global
NEWS

అడిలైడ్ టెస్టుకు టీమిండియా రెడీ

కంగారూ గడ్డపై సిరీస్ విజయానికి 7 దశాబ్దాలుగా నిరీక్షణ తుదిజట్టులో ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ తో బరిలోకి టీమిండియా టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా, 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియాజట్ల టెస్ట్ సిరీస్ తొలిసమరానికి…అడిలైడ్ ఓవల్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి…. సిరీస్ నెగ్గాలని గత ఏడుదశాబ్దాలుగా నిరీక్షిస్తున్న టీమిండియా…. తొలిసారిగా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. టీమిండియా 1- ఆస్ట్రేలియా 5 సాంప్రదాయ […]

అడిలైడ్ టెస్టుకు టీమిండియా రెడీ
X
  • కంగారూ గడ్డపై సిరీస్ విజయానికి 7 దశాబ్దాలుగా నిరీక్షణ
  • తుదిజట్టులో ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్
  • ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ తో బరిలోకి టీమిండియా

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా, 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియాజట్ల టెస్ట్ సిరీస్ తొలిసమరానికి…అడిలైడ్ ఓవల్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి…. సిరీస్ నెగ్గాలని గత ఏడుదశాబ్దాలుగా నిరీక్షిస్తున్న టీమిండియా…. తొలిసారిగా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

టీమిండియా 1- ఆస్ట్రేలియా 5

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మరో ఆసక్తికరమైన పోరుకు…కంగారూ గడ్డపై రంగం సిద్ధమయ్యింది. టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా, 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా…నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో అమీతుమీకి సిద్ధమయ్యాయి.

సిరీస్ లోని తొలిటెస్ట్ కోసం…అడిలైడ్ ఓవల్ లో పచ్చికతో కూడిన ఫాస్ట్ అండ్ బౌన్సీ వికెట్ ను ఆతిథ్య ఆస్ట్రేలియా సిద్ధం చేసి మరీ సవాలు విసిరింది. టీమిండియా పవర్ ఫుల్ బ్యాటింగ్, కంగారూ పదునైన బౌలింగ్ ఎటాక్ ల మధ్య ఈ పోటీ జరుగనుంది.

హాట్ ఫేవరెట్ టీమిండియా….

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ డార్క్ హార్స్ గా ఉన్న టీమిండియా…గత ఏడు దశాబ్దాల కాలంలో తొలిసారిగా …హాట్ ఫేవరెట్ టాగ్ తో పోటీకి దిగుతోంది.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లు ఇద్దరూ ఏడాదికాలం నిషేధంతో ఆటకు దూరం కావడంతో… కంగారూ టీమ్ గతంలో ఎన్నడూలేనంత బలహీనంగా మారింది.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టిమ్ పెయిన్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా..బ్యాటింగ్ లో అంతంత మాత్రంగా ఉన్నా… బౌలింగ్ విభాగంలో మాత్రం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

మిషెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్ వుడ్, పీటర్ సిడిల్ లాంటి మెరుపు ఫాస్ట్ బౌలర్ల తో పాటు…ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ సైతం…టీమిండియా టాపార్డర్ సత్తాకు… సవాలు విసురుతున్నారు.

నలుగురు బౌలర్ల వ్యూహంతో విరాట్ సేన….

టెస్ట్ మ్యాచ్ నెగ్గాలన్నా…రెండుసార్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసి 20 వికెట్లు పడగొట్టాలన్నా…తుదిజట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉండితీరాలి. అయితే…టీమిండియా మాత్రం…. తొలిటెస్ట్ కు ఎంపిక చేసిన తుదిజట్టులో ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్ తో పోటీకి దిగాలని నిర్ణయించింది.

ఆరో నంబర్ స్థానం కోసం…రోహిత్ శర్మతో పాటు…హనుమ విహారిని సైతం తుదిజట్టులో చేర్చారు. జస్ ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ లతో కూడిన నలుగురు సభ్యుల బౌలింగ్ జట్టుపైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

విరాట్ కొహ్లీ, మురళీ విజయ్, రాహుల్, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ లతో కూడిన ఎటాకింగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా…ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ తో పోటీకి దిగడం…ఆత్మరక్షణ వ్యూహమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

7 దశాబ్దాలుగా నిరీక్షణ….

ఆస్ట్రేలియా గడ్డపై 1947లో తొలిటెస్ట్ మ్యాచ్ తో పాటు సిరీస్ ఆడిన టీమిండియా…నాటినుంచి గత 70 సంవత్సరాల కాలంలో ఒక్కసారీ సిరీస్ నెగ్గలేకపోయింది.

గత ఏడు దశాబ్దాల కాలంలో 11 సిరీస్ ల్లో భాగంగా ఆడిన 44 టెస్టుల్లో టీమిండియాకు ఐదంటే ఐదు విజయాలు మాత్రమే ఉండటం విశేషం.

ఓవరాల్ గా టీమిండియా- ఆసీస్ జట్లు 25 సిరీస్ ల్లో తలపడితే …ఆస్ట్రేలియా 12 విజయాలు, టీమిండియా 8 సిరీస్ విజయాలు సాధించగా…ఐదు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. మొత్తం 68 టెస్టుల్లో ఈ రెండుజట్లు ఢీ కొంటే…ఆస్ట్రేలియా 41 విజయాలు, టీమిండియా 26 విజయాలు సాధించాయి.

గత రికార్డుల ప్రకారం ఆస్ట్రేలియాదే పైచేయిగా కనిపిస్తున్నా…ఇటీవలి కాలంలో టీమిండియా ఆటతీరు, ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని బట్టి చూస్తే…ప్రస్తుత సిరీస్ లో విరాట్ ఆర్మీనే అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

టీమిండియా స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే…ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా ఓ టెస్ట్ సిరీస్ నెగ్గడం ద్వారా…ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించే అవకాశం ఉంటుంది.

First Published:  5 Dec 2018 3:47 AM GMT
Next Story