Telugu Global
NEWS

మోత్కుపల్లికి పవన్‌ కళ్యాణ్‌ మద్దతు

పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన తొలి మద్దతును ప్రకటించారు. నల్గొండ జిల్లా ఆలేరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నమాజీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లికి ఫోన్ చేసి మరీ మద్దతు ప్రకటించారు. తాము నిర్వహించిన సర్వేలో ఆలేరులో మోత్కుపల్లి గెలవబోతున్నారని పవన్ చెప్పారట.. ఈ మేరకు పవన్ తనకు మద్దతిచ్చారని మోత్కుపల్లి తాజాగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ దారెటు అంటే.. తెలంగాణలో చెప్పలేని పరిస్థితి. ఆయన తాజాగా ట్విట్టర్ లో జనసేన అధిపతిగా తెలంగాణలో ఎవరికి మద్దతిస్తున్నారని స్నేహితులు, […]

మోత్కుపల్లికి పవన్‌ కళ్యాణ్‌ మద్దతు
X

పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన తొలి మద్దతును ప్రకటించారు. నల్గొండ జిల్లా ఆలేరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నమాజీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లికి ఫోన్ చేసి మరీ మద్దతు ప్రకటించారు. తాము నిర్వహించిన సర్వేలో ఆలేరులో మోత్కుపల్లి గెలవబోతున్నారని పవన్ చెప్పారట.. ఈ మేరకు పవన్ తనకు మద్దతిచ్చారని మోత్కుపల్లి తాజాగా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ దారెటు అంటే.. తెలంగాణలో చెప్పలేని పరిస్థితి. ఆయన తాజాగా ట్విట్టర్ లో జనసేన అధిపతిగా తెలంగాణలో ఎవరికి మద్దతిస్తున్నారని స్నేహితులు, అభిమానులు, బంధువులు ప్రశ్నిస్తున్నారని… దీనిపై 5వ తేదీన ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. ఈ నెల 5న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎవరికి మద్దత్తు ఇస్తారనే విషయం తేలనుంది.

First Published:  4 Dec 2018 1:30 AM GMT
Next Story