Telugu Global
NEWS

మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాంగ్రెస్ దరిద్రులే....

‘కేసీఆర్ ఎంత మందితో అని కొట్లాడుతాడు… అటు కూటమిలోని చంద్రబాబు, కాంగ్రెస్ వాళ్లతోపాటు ఇటు మహబూబ్ నగర్ దరిద్రులతో కొట్లాడాలా..? మహబూబ్ నగర్ ఇలా వెనుకబడిందంటే ఎవరివల్లనో కాదు… ఈ జిల్లాలోని కాంగ్రెస్ నేతల వల్లే…. ఆ దరిద్రులను తరిమికొట్టండి’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీలు కాదు గెలవాల్సిందని…. మహబూబ్ నగర్ ప్రజలు అని కోరారు. మహబూబ్ నగర్ వెనుకబాటుకు ఇక్కడ […]

మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాంగ్రెస్ దరిద్రులే....
X

‘కేసీఆర్ ఎంత మందితో అని కొట్లాడుతాడు… అటు కూటమిలోని చంద్రబాబు, కాంగ్రెస్ వాళ్లతోపాటు ఇటు మహబూబ్ నగర్ దరిద్రులతో కొట్లాడాలా..? మహబూబ్ నగర్ ఇలా వెనుకబడిందంటే ఎవరివల్లనో కాదు… ఈ జిల్లాలోని కాంగ్రెస్ నేతల వల్లే…. ఆ దరిద్రులను తరిమికొట్టండి’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీలు కాదు గెలవాల్సిందని…. మహబూబ్ నగర్ ప్రజలు అని కోరారు. మహబూబ్ నగర్ వెనుకబాటుకు ఇక్కడ తరాలుగా గెలిచిన కాంగ్రెస్ వాళ్లే కారణమన్నారు.

కొడంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాదని… ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని మరీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ అంతా కొండలు, గుట్టలు , బీడుగా ఉందని… ఎందుకు ఈ కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇన్నేళ్లు అభివృద్ధి చేయలేదని విరుచుకు పడ్డారు.

మహబూబ్ నగర్ కు చెందిన నాగం జనార్ధన్ రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టులో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దంటూ కేసు వేశారని.. ఇది రాజకీయ కుట్రతో వేసిన పిటీషన్ అని హైకోర్టు చెంపపెట్టులా తీర్పు చెప్పిందని కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ వెనుకబాటుకు కారణం ఇక్కడి నేతలే అని చెప్పుకొచ్చారు. వాళ్లు చేయరు.. మేం చేస్తామంటే చేయనివ్వరని కేసీఆర్ ప్రసంగించారు.

ప్రతి ఏటా వేల గొర్రెలను హైదరాబాద్ కు పక్కరాష్ట్రాల నుంచి తీసుకొస్తారని… మహబూబ్ నగర్ లోని గొల్ల కుర్మెలకు అందుకే గొర్రెలు ఇచ్చి వారితో ఆర్థికాభివృద్ధి చేయించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే మహబూబ్ నగర్ ను దగ్గరుండి అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కృష్ణానదిపై డిమాండ్ చేస్తున్న ఎత్తిపోతలను పూర్తి చేసే బాధ్యత నాది అని కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాకు నీరు ఇచ్చి సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు గెలిస్తే మహబూబ్ నగర్ ఇలానే ఉంటుందని…. టీఆర్ఎస్ గడిచిన నాలుగేళ్లలోనే కల్వకుర్తిని పూర్తి చేసి నీళ్లు అందించామని…. తాము చేసిన అభివృద్ధి మీ కళ్లముందే ఉందని…. చూసి ఓటేయాలని కోరారు.

కేసీఆర్ కొడంగల్ ప్రసంగంలో తన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మహబూబ్ నగర్ కు సాగు, తాగు నీరు, అభివృద్ధి, కేసీఆర్ అమలు చేసిన పథకాలను వల్లెవేశారు. కానీ రేవంత్ రెడ్డి గురించి ఎక్కడా కేసీఆర్ డైరెక్ట్ గా ప్రస్తావించకపోవడం విశేషం.

First Published:  4 Dec 2018 6:10 AM GMT
Next Story