Telugu Global
NEWS

వైసీపీ ఎమ్మెల్యేకు 30 కోట్ల ఆఫర్

టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్‌ను మరో వైసీపీ ఎమ్మెల్యే వివరించారు. 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపచేసిన టీడీపీ మరికొందరికి కూడా వలేసింది. కానీ 23 మందితోనే ఆ సంఖ్య ఆగిపోయింది. పలువురు తమకు వచ్చిన ఆఫర్లను తిరస్కరించారు. ఇదే తరహాలో తనకు వచ్చిన ఆఫర్‌ గురించి వివరించారు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు. టీడీపీలో చేరితే 30 కోట్లు ఇస్తామంటూ తనకు ఆఫర్ వచ్చిందని చెప్పారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన […]

వైసీపీ ఎమ్మెల్యేకు 30 కోట్ల ఆఫర్
X

టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్‌ను మరో వైసీపీ ఎమ్మెల్యే వివరించారు. 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపచేసిన టీడీపీ మరికొందరికి కూడా వలేసింది. కానీ 23 మందితోనే ఆ సంఖ్య ఆగిపోయింది.

పలువురు తమకు వచ్చిన ఆఫర్లను తిరస్కరించారు. ఇదే తరహాలో తనకు వచ్చిన ఆఫర్‌ గురించి వివరించారు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు.

టీడీపీలో చేరితే 30 కోట్లు ఇస్తామంటూ తనకు ఆఫర్ వచ్చిందని చెప్పారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన…. చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలన్న కోరిక తనలో ఉండేదన్నారు.

వైఎస్‌ జగన్ వల్లే ఆ కోరిక నెరవేరిందన్నారు. తాను ఎన్నటికీ జగన్‌తోనే ఉంటానని… అందుకే 30 కోట్లు ఇస్తామన్నా తాను పార్టీ వీడేందుకు అంగీకరించలేదని చెప్పారు.

First Published:  2 Dec 2018 11:40 PM GMT
Next Story