Telugu Global
NEWS

కేసీఆర్‌ పక్కన నిలబడి కాంగ్రెస్‌ను తిట్టాల్సినవాడు....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…. రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఇదే చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి కాపురం చేశారని…. ఆ సమయంలో మోడీని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేరంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. మోడీ చేసినంత మేలు ఏపీకి ఏ ప్రభుత్వం చేయలేదని ఇదే చంద్రబాబు చెప్పారన్నారు. నాలుగేళ్ల పాటు మోడీ, చంద్రబాబు చేసిన కాపురం చూసి చిలుక గోరింకలు కూడా సిగ్గుపడ్డాయన్నారు. నాలుగేళ్ల […]

కేసీఆర్‌ పక్కన నిలబడి కాంగ్రెస్‌ను తిట్టాల్సినవాడు....
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…. రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఇదే చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి కాపురం చేశారని…. ఆ సమయంలో మోడీని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేరంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు తీర్మానాలు చేశారని గుర్తు చేశారు.

మోడీ చేసినంత మేలు ఏపీకి ఏ ప్రభుత్వం చేయలేదని ఇదే చంద్రబాబు చెప్పారన్నారు. నాలుగేళ్ల పాటు మోడీ, చంద్రబాబు చేసిన కాపురం చూసి చిలుక గోరింకలు కూడా సిగ్గుపడ్డాయన్నారు. నాలుగేళ్ల తర్వాత తన మోసాలను, వైఫల్యాలను మరొకరిపై నెట్టేందుకు ఎన్‌డీఏకు చంద్రబాబు విడాకులు ఇచ్చారన్నారు.

2014లో సోనియాను అవినీతి అనకొండ అని విమర్శించిన చంద్రబాబు… దేవత అంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ లాంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పాలిస్తారా? అని చంద్రబాబు గతంలో ప్రశ్నించారని… ఇప్పుడు మాత్రం రాహుల్‌ అంత మేధావి లేడంటున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు.

జూన్‌ 8న ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పాలన అవినీతిమయం అయిందంటూ చార్జిషీట్‌ కూడా విడుదల చేసిందన్నారు. ఇప్పుడు మాత్రం సిగ్గులేకుండా తెలంగాణలో రాహుల్, చంద్రబాబు ఒకే వేదిక ఎక్కి మాట్లాడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు.

ఆగస్ట్ 29న హరికృష్ణ చనిపోతే అక్కడికి వెళ్లి భౌతిక కాయం పక్కన పెట్టుకుని టీఆర్‌ఎస్‌- టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని కేటీఆర్‌తో చంద్రబాబు చెప్పారని జగన్‌ గుర్తు చేశారు. అయితే కేటీఆర్‌ అందుకు ఒప్పుకోకపోవడంతో వెంటనే కాంగ్రెస్‌తో డీల్‌ చేసుకున్నారన్నారు.

చంద్రబాబు తన అవినీతి సొమ్ము ఇస్తాననే సరికి కాంగ్రెస్‌ వాళ్లు సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకున్నారని జగన్‌ విమర్శించారు. టీడీపీతో పొత్తును టీఆర్‌ఎస్ ఒప్పుకునే ఉంటే ఇదే చంద్రబాబు ఈరోజు తెలంగాణలో కేసీఆర్‌ పక్కన నిలబడి కాంగ్రెస్‌ను తిట్టేవారన్నారు. ఇలాంటి నీచరాజకీయాలు చేస్తూ తిరిగి తాను చక్రం తిప్పుతున్నా అంటూ ప్రచారం చేసుకుంటున్నారని జగన్ ఫైర్ అయ్యారు.

First Published:  3 Dec 2018 6:50 AM GMT
Next Story