Telugu Global
NEWS

పవన్‌ సినిమాకు నిర్మాత ఎవరో చెప్పిన జగన్‌

తనను అవినీతి పరుడూ అంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన జగన్‌… చంద్రబాబు డబ్బులు ఇచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్ కాల్‌షీట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాటు పవన్‌ కల్యాణ్… చంద్రబాబుకు పార్టనర్‌గా వ్యవహరించారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు చేసిన ప్రతి మోసంలోనూ, అవినీతిలోనూ పవన్‌ భాగస్వామి కాదా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబుతో కాపురం చేసి ఇప్పుడు […]

పవన్‌ సినిమాకు నిర్మాత ఎవరో చెప్పిన జగన్‌
X

తనను అవినీతి పరుడూ అంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన జగన్‌… చంద్రబాబు డబ్బులు ఇచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్ కాల్‌షీట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

నాలుగేళ్ల పాటు పవన్‌ కల్యాణ్… చంద్రబాబుకు పార్టనర్‌గా వ్యవహరించారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు చేసిన ప్రతి మోసంలోనూ, అవినీతిలోనూ పవన్‌ భాగస్వామి కాదా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబుతో కాపురం చేసి ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో విడిపోయినట్టు నటిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్‌ రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు.

కథ, స్ర్కీన్‌ ప్లే, దర్శకత్వం చంద్రబాబు వహిస్తుంటే… నిర్మాతగా లింగమనేని ఉండగా పవన్‌ కల్యాణ్ యాక్షన్ చేస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు పేమెంట్‌ ఇస్తే అప్పుడు జగన్‌పై విమర్శలు చేసేందుకు పవన్ కల్యాణ్ కాల్‌ షీట్‌ ఇస్తుంటారని జగన్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేస్తున్న అవినీతి, అక్రమాలపై తొలి నుంచి పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తిని తానేనని జగన్‌ చెప్పారు. పవన్ కల్యాణ్ మాత్రం నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబుతో కాపురం చేసి… ఇప్పుడు మాత్రం తిరిగి తనను విమర్శిస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. తాను అవినీతి చేయడం పవన్‌ కల్యాణ్ చూశారా? అని నిలదీశారు.

First Published:  3 Dec 2018 6:36 AM GMT
Next Story