Telugu Global
NEWS

నాపై కోపాన్ని ఎన్నికలయ్యే వరకు దాచుకోండి.... ప్లీజ్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. లెంపలేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు మెట్లు దిగి వచ్చి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు వెనుకాడడం లేదు. తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా పదవి చేపట్టి…. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల…. ఈసారి ముందే జాగ్రత్తపడుతున్నారు. తనపై కార్యకర్తల్లో, ప్రజల్లో ఉన్న కోపాన్ని గుర్తించి అందుకు విరుగుడుగా […]

నాపై కోపాన్ని ఎన్నికలయ్యే వరకు దాచుకోండి.... ప్లీజ్‌
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. లెంపలేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు మెట్లు దిగి వచ్చి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు వెనుకాడడం లేదు. తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా పదవి చేపట్టి…. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల…. ఈసారి ముందే జాగ్రత్తపడుతున్నారు.

తనపై కార్యకర్తల్లో, ప్రజల్లో ఉన్న కోపాన్ని గుర్తించి అందుకు విరుగుడుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన తుమ్మల… తనపై కోపమున్నా…. ఆ కోపతాపాలను ఈ ఎన్నికల్లో మాత్రం చూపించ వద్దని విజ్ఞప్తి చేశారు.

కోపాన్ని పక్కనపెట్టి తనను గెలిపించాలని… ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందామని ప్రజలకు, పార్టీ శ్రేణులకు విన్నవించుకున్నారు తుమ్మల. తనతో పాటు వెంకటేశ్వర్లు పైనా ఉన్న కోపాన్ని కూడా ఎన్నికల వరకు దాచుకోవాలని కోరారు. తాటి వెంకటేశ్వర్లును ఐదు వేల నుంచి పది వేల మెజార్టీతో గెలిపించాలని తుమ్మల కోరారు.

తుమ్మల కొద్దిరోజుల క్రితం ఒక నది వద్ద అధికారులతో మాట్లాడుతూ…. పక్కా బూతులు ఉచ్చరిస్తూ…. పనిలో పనిగా రాజశేఖర రెడ్డి మీద కూడా ఓ బూతు కామెంట్‌ చేశాడు. అది అప్పుడు వైరల్‌ అయింది. చాలా రోజుల తరువాత మళ్ళీ దాన్ని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దానిని చూసిన చాలా మంది వైఎస్‌ అభిమానులు తుమ్మల పై కసిగా ఉన్నారు. బహుశా అది తెలిసే ఏమో తుమ్మల ఇప్పుడు కోప తాపాలను మరిచిపోండని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఉన్నాడని కొందరంటున్నారు.

First Published:  3 Dec 2018 7:20 AM GMT
Next Story