Telugu Global
Cinema & Entertainment

"ఆర్.ఆర్.ఆర్" తొలి షెడ్యూల్ పూర్తి చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్.ఆర్.ఆర్” కోసం పూర్తిస్థాయిలో షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పూర్తి స్థాయి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ షెడ్యూల్ కి రామ్ చరణ్ ముగింపు పలికేశాడట. రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నాడు. ఇంకో రెండు రోజుల్లో శబరి వెళ్లి అక్కడ మాల విరమణ చెయ్యనున్నాడు రామ్ చరణ్. అక్కడ నుంచి వచ్చిన వెంటనే “వినయ విధేయ రామ” చిత్రంలో […]

ఆర్.ఆర్.ఆర్ తొలి షెడ్యూల్ పూర్తి చేసిన రామ్ చరణ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్.ఆర్.ఆర్” కోసం పూర్తిస్థాయిలో షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పూర్తి స్థాయి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ షెడ్యూల్ కి రామ్ చరణ్ ముగింపు పలికేశాడట.

రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నాడు. ఇంకో రెండు రోజుల్లో శబరి వెళ్లి అక్కడ మాల విరమణ చెయ్యనున్నాడు రామ్ చరణ్. అక్కడ నుంచి వచ్చిన వెంటనే “వినయ విధేయ రామ” చిత్రంలో బ్యాలన్స్ ఉన్న ఐటెం సాంగ్ షూట్ లో పాల్గొంటాడట రామ్ చరణ్.

మాలలో ఉన్నాడు కాబట్టే ఇన్ని రోజులు ఈ ఐటెం సాంగ్ ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడట రామ్ చరణ్. ఐటెం సాంగ్ షూట్ కూడా పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ పనుల్లో బిజీ అయిపోనున్నాడట రామ్ చరణ్.

ఇక మళ్ళీ వచ్చే ఏడాది జనవరి వరకు “ఆర్.ఆర్.ఆర్” కి డేట్స్ కేటాయించాడు రామ్ చరణ్. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న “వినయ విధేయ రామ” వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజ్ కానుంది.

First Published:  3 Dec 2018 3:06 AM GMT
Next Story