Telugu Global
NEWS

భారీగా డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ అభ్యర్థి భవ్య ప్రసాద్ కారు

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు రోజులు దగ్గర పడడంతో కట్టల పాములు బుసలు కొడుతున్నాయి. ఇప్పటి వరకు విస్రృతంగా ప్రచారంచేసిన అభ్యర్థులు ఇప్పుడు ఓటర్లను లోబరుచుకునేందుకు తమ నోట్ల కట్టలను రంగంలోకి దింపుతున్నారు. శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి, నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్‌ కారు హైదరాబాద్‌లో భారీ నగదుతో పట్టుబడింది. భవ్య ప్రసాద్ కారులో 70లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి సింగ్‌ నగర్‌లో ఓటర్లకు డబ్బు పంచుతున్న సమయంలోనే […]

భారీగా డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ అభ్యర్థి భవ్య ప్రసాద్ కారు
X

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు రోజులు దగ్గర పడడంతో కట్టల పాములు బుసలు కొడుతున్నాయి. ఇప్పటి వరకు విస్రృతంగా ప్రచారంచేసిన అభ్యర్థులు ఇప్పుడు ఓటర్లను లోబరుచుకునేందుకు తమ నోట్ల కట్టలను రంగంలోకి దింపుతున్నారు.

శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి, నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్‌ కారు హైదరాబాద్‌లో భారీ నగదుతో పట్టుబడింది. భవ్య ప్రసాద్ కారులో 70లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి సింగ్‌ నగర్‌లో ఓటర్లకు డబ్బు పంచుతున్న సమయంలోనే భవ్య ప్రసాద్‌ టీంను పట్టుకున్నారు. ఈ డబ్బును భవ్య సిమెంట్ డైరెక్టర్ శివకుమార్ తీసుకొచ్చారు.

శివకుమార్‌ను, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా… భవ్యప్రసాద్‌ కుమారుడు భవ్యా ఆదిత్య ఆదేశాల మేరకు ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చామని సిమెంట్ కంపెనీ డైరెక్టర్ శివకుమార్‌ అంగీకరించారు. డబ్బుతో పాటు కారును సీజ్‌ చేసిన పోలీసులు శివకుమార్, కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

First Published:  2 Dec 2018 9:32 PM GMT
Next Story