Telugu Global
International

14 విమానాల రద్దు.... షాకిచ్చిన పైలెట్లు

దేశంలోని ప్రముఖ ప్రైవేటు ఎయిర్ లైన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ తాజాగా 14 విమాన సర్వీసులను రద్దు చేసింది. విమాన పైలెట్లు సడన్ గా ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కానీ జీతాలు ఇవ్వకపోవడంతో వారంతా సామూహికంగా సెలవులు పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ సంస్థ పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులు తీర్చేమార్గం లేక ఆగస్టు నుంచి పైలెట్లు, సీనియర్ మేనేజ్ మెంటర్లకు, ఇంజనీర్లకు జీతాలను […]

14 విమానాల రద్దు.... షాకిచ్చిన పైలెట్లు
X

దేశంలోని ప్రముఖ ప్రైవేటు ఎయిర్ లైన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ తాజాగా 14 విమాన సర్వీసులను రద్దు చేసింది. విమాన పైలెట్లు సడన్ గా ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కానీ జీతాలు ఇవ్వకపోవడంతో వారంతా సామూహికంగా సెలవులు పెట్టినట్టు తెలిసింది.

ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ సంస్థ పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులు తీర్చేమార్గం లేక ఆగస్టు నుంచి పైలెట్లు, సీనియర్ మేనేజ్ మెంటర్లకు, ఇంజనీర్లకు జీతాలను ఇవ్వడం లేదు. అందుకే పైలెట్లు సహకరించకుండా సామూహిక సెలవులు పెట్టారని విమానయాన సంస్థ అధికార ప్రతినిధి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

అయితే జెట్ ఎయిర్ వేస్ మాత్రం తాము సెప్టెంబర్ నెల జీతాలను సిబ్బందికి ఇచ్చామని.. కేవలం అక్టోబర్, నవంబర్ నెల జీతాలు మాత్రమే ఇవ్వలేదని పీటీఐకి తెలిపారు. అయితే ఈ విషయంలో పైలెట్లు జెట్ ఎయిర్ వేస్ సంస్థ చైర్మన్ నరేష్ గోయల్ కు లేఖ రాశారు. తమకు జీతాలు లేనిదే పూట గడవడం లేదని.. సాలరీ ఇవ్వనిదే పనిచేయలేమని లేఖలో స్పష్టం చేశారు.

జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నడిపిస్తోంది. పైలెట్ల సమ్మె కారణంగా జెట్ ఎయిర్ వేస్ తీవ్రంగా నష్టపోతోంది. ప్రయాణికులను వేరే విమానాల్లో సర్దుబాటు చేసి పంపిస్తోంది. ఉద్యోగులకు పూర్తిగా సహకరిస్తామని తమకు సహకరించి విధుల్లో చేరాలని జెట్ ఎయిర్ వేస్ కోరుతోంది. కానీ ఉద్యోగులు పట్టువీడడం లేదు.

First Published:  3 Dec 2018 1:22 AM GMT
Next Story