Telugu Global
Cinema & Entertainment

"గీత గోవిందం" సినిమాకి సీక్వెల్ ఉందట !

“గీత గోవిందం” సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత డైరెక్ట్ చేసిన పరశురాం కి ఇండస్ట్రీలో మంచి పేరు అయితే వచ్చింది. అయితే తన తదుపరి సినిమా కోసం కథలు రాస్తూనే “గీత గోవిందం” సీక్వెల్ కి కూడా కథని రెడీ చేసాడట పరశురాం. విజయ్ దేవరకొండ కూడా ఎప్పుడో పరశురాం కి “గీత గోవిందం” సినిమాకి సీక్వెల్ కథ రెడీ చేయమని […]

గీత గోవిందం సినిమాకి సీక్వెల్ ఉందట !
X

“గీత గోవిందం” సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత డైరెక్ట్ చేసిన పరశురాం కి ఇండస్ట్రీలో మంచి పేరు అయితే వచ్చింది.

అయితే తన తదుపరి సినిమా కోసం కథలు రాస్తూనే “గీత గోవిందం” సీక్వెల్ కి కూడా కథని రెడీ చేసాడట పరశురాం. విజయ్ దేవరకొండ కూడా ఎప్పుడో పరశురాం కి “గీత గోవిందం” సినిమాకి సీక్వెల్ కథ రెడీ చేయమని చెప్పాడట. దాన్ని సీరియ‌స్ గా తీసుకున్న ప‌ర‌శురామ్ “మ‌ళ్ళీ గీతాగోవిందం” పేరుతో ఓ క‌థ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.

ఈ సినిమాలోనూ విజ‌య్ దేవరకొండ, ర‌ష్మిక జంట‌గా న‌టించ‌బోతున్న‌ట్టు టాక్‌. కాక‌పోతే విజ‌య్ దేవరకొండ ప్ర‌స్తుతానికి ఖాళీగా లేడు. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పరశురాం కి విజయ్ డేట్స్ దొరకాలి అంటే మినిమన్ రెండేళ్ళు ఆగాల్సి వస్తుంది.

సో ఈ లోపు “మళ్ళీ గీత గోవిందం” కథని పూర్తి స్థాయిలో రెడీ చేసుకొని… వేరే సినిమాని డైరెక్ట్ చేసి…. అప్పుడు విజయ్ దగ్గరకి ఈ సీక్వెల్ కథని తీసుకొని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడట పరశురాం. మొత్తానికి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

First Published:  3 Dec 2018 7:00 AM GMT
Next Story