Telugu Global
NEWS

ఫెయిర్ ఫాక్స్ పై క్రిస్ గేల్ సూపర్ సిక్సర్

పరువునష్టం దావా కేసులో విన్నర్ క్రిస్ గేల్ క్రిస్ గేల్ కు భారీ నష్టపరిహారం ఆస్ట్రేలియా మీడియా సంస్థ పై క్రిస్ గేల్ విజయం క్రికెట్ ఫీల్డ్ లో తన పవర్ ఫుల్ హిట్టింగ్ తో సిక్సర్ల మోత మోగించే కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్…న్యాయపోరాటంలోనూ తనకుతానే సాటిగా నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ మీడియా సంస్థ ఫెయిర్ ఫాక్స్ పై వేసిన పరువునష్టం దావా కేసులో క్రిస్ గేల్ విజేతగా నిలిచాడు. 3 లక్షల డాలర్లు […]

ఫెయిర్ ఫాక్స్ పై క్రిస్ గేల్ సూపర్ సిక్సర్
X
  • పరువునష్టం దావా కేసులో విన్నర్ క్రిస్ గేల్
  • క్రిస్ గేల్ కు భారీ నష్టపరిహారం
  • ఆస్ట్రేలియా మీడియా సంస్థ పై క్రిస్ గేల్ విజయం

క్రికెట్ ఫీల్డ్ లో తన పవర్ ఫుల్ హిట్టింగ్ తో సిక్సర్ల మోత మోగించే కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్…న్యాయపోరాటంలోనూ తనకుతానే సాటిగా నిలుస్తున్నాడు.

ఆస్ట్రేలియాలోని ప్రముఖ మీడియా సంస్థ ఫెయిర్ ఫాక్స్ పై వేసిన పరువునష్టం దావా కేసులో క్రిస్ గేల్ విజేతగా నిలిచాడు. 3 లక్షల డాలర్లు పరిహారంగా చెల్లించాలంటూ న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఏడాది తర్వాత తీర్పు….

2016 జనవరిలో తనపై ఊహాజనిత, తప్పుడు, అసభ్యకర కథనాల్ని ప్రచురించిన ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌పై క్రిస్ గేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ న్యూసౌత్‌వేల్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై గత ఏడాదిగా సాగిన విచారణ అనంతరం…కొద్ది గంటల క్రితమే అంతిమ తీర్పుని వెలువరించిన కోర్డు.. తప్పుడు కథనాల్ని ప్రచురించినందుకు క్రిస్‌గేల్‌కి పరిహారం రూపంలో 3 లక్షల అమెరికన్ డాలర్లని చెల్లించాలని ఆదేశించింది.

గేల్ అంత తప్పు చేశాడా?

అసలు ఏం జరిగిందంటే..? ఐసీసీ వన్డే ప్రపంచకప్‌- 2015 సమయంలో క్రిస్‌గేల్ తన హోటల్‌ రూములోకి వచ్చిన మహిళా మసాజ్ థెరపిస్ట్‌ లియానీ రస్సెల్ తో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫెయిర్‌ఫాక్స్‌ మీడియా దినపత్రికలు‌..ది కాన్‌బెర్రా టైమ్స్‌, ది ఏజ్‌, ది సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, 2016 జనవరిలో వరుస కథనాల్లో ఎండగట్టాయి. అందులో ‘క్రిస్‌గేల్‌ సిడ్నీలోని తన డ్రెస్సింగ్‌ రూమ్‌‌కి మహిళా మసాజ్‌ థెరపిస్టును పిలిపించుకుని…ఆమె ముందు అసభ్యకరంగా తన మర్మాంగాలను ప్రదర్శింశించాడంటూ పేర్కొన్నాయి.

గేల్ గరంగరం….

తన పై ఫెయిర్ ఫాక్స్ మీడియా కథనాలపై క్రిస్ గేల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.గేల్ అప్పట్లో ఆ వార్తల్ని ఖండిస్తూ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకు అలా కథనాలు ప్రచురించారని.. తన క్రీడాజీవితంలో ఇది చాలా బాధాకరమైన విషయమని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. తన నిజాయతీని నిరూపించుకునేందుకు కోర్టులోనే తేల్చుకొంటానని ప్రకటించిన క్రిస్‌గేల్..చివరకు న్యాయపోరాటంలోనే విజేతగా నిలిచాడు.

మహిళా మసాజ్ థెరపిస్ట్‌‌తో క్రిస్‌గేల్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు నిరూపించడంలో ఆస్ట్రేలియా ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్థ విఫలమైంది. దీంతో నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించినందుకు పరిహారం చెల్లించాలని న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు…విచారణ సవ్యంగా జరుగలేదంటూ…ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్థ అంటోంది. తాము సైతం న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.

First Published:  3 Dec 2018 11:41 AM GMT
Next Story