Telugu Global
NEWS

తెలంగాణలో పార్టీల చివరి బ్రహ్మాస్త్రాలు పేలుతాయా ?

లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…. అని పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో వీరావేశంతో ఓ డైలాగ్ కొడుతాడు. ఇప్పుడు తెలంగాణ బరిలో నిలిచిన పార్టీలు చివరి నిమిషంలో బ్రహ్మాస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు.. సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్ని మేనిఫెస్టోలు ప్రకటించి ముందుకెళుతున్న వేళ గులాబీ పార్టీ మేనిఫెస్టో మాత్రం రిలీజ్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ తాజాగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే […]

తెలంగాణలో పార్టీల చివరి బ్రహ్మాస్త్రాలు పేలుతాయా ?
X

లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…. అని పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో వీరావేశంతో ఓ డైలాగ్ కొడుతాడు. ఇప్పుడు తెలంగాణ బరిలో నిలిచిన పార్టీలు చివరి నిమిషంలో బ్రహ్మాస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు..

సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్ని మేనిఫెస్టోలు ప్రకటించి ముందుకెళుతున్న వేళ గులాబీ పార్టీ మేనిఫెస్టో మాత్రం రిలీజ్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ తాజాగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా రైతులు, యువకులకు అద్భుతమైన పథకాలను రూపొందించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ చివరి బ్రహ్మాస్త్రం ఖచ్చితంగా ఓట్ల వాన కురిపిస్తుందని గులాబీ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి.

ఇక డిసెంబర్ 3, 5 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. 5వ తేదీలోపు సోనియాగాంధీని కూడా మరోసారి రప్పించేందుకు కాంగ్రెస్ యోచిస్తోందట. ఇప్పటికే సోనియా సభతో వచ్చిన వేవ్ తో మరోసారి ఆమెను రప్పించి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చి సెంటిమెంట్ రాజేసి ఓట్లు రాబట్టుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

ఇక బీజేపీ తూరుపుముక్కలను బయటకు తీస్తోంది. 5వ తేదీన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను తెలంగాణ ప్రచారానికి పిలుస్తోంది. 3, 4వ తేదీల్లో ప్రధాని మోడీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారట.. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా 4వ తేదీన వేములవాడలో పర్యటించబోతున్నారు. ఇలా హేమాహేమీలను రంగంలోకి దించి బీజేపీ అదృష్టం పరీక్షించుకోబోతోంది.

ఏపీ సీఎం చంద్రబాబు కూడా 5వ తేదీ లోపు తమకు పట్టున్న హైదరాబాద్, ఖమ్మం జిల్లాలలో సభలు, రోడ్ షోలకు ప్లాన్ చేశారు. బాలయ్య కూడా ప్రచార రంగంలోకి దూకేశారు. దీంతో తెలంగాణలో ఈ నాలుగు రోజులు ప్రచారం హోరెత్తనుంది.

ఇలా మూడు పార్టీలు చివరి నిమిషంలో తెలంగాణలో ప్రచారం హోరెత్తించడానికి హామీల వరద పారించడానికి రెడీ అయ్యాయి. చిట్టచివరగా దాచిన బ్రహ్మస్త్రాలను కూడా సంధించబోతున్నారు. మరి అంతిమ ప్రచారం పార్టీలకు ఏమేరకు సహకరిస్తుంది. ఓటర్లు ఎవరికి పట్టకడుతారనేది వేచి చూడాల్సిందే.

First Published:  1 Dec 2018 11:58 PM GMT
Next Story