Telugu Global
NEWS

ఓటమి భయంతో వణుకుతున్న కాంగ్రెస్ సీనియర్లు!

కాంగ్రెస్ సీనియర్ నేతలను ఓటమి భయం వెంటాడుతోందా? టీఆర్ఎస్ ఊపులో తమ సీటు గల్లంతవ్వడం ఖాయమని వణికిపోతున్నారా? అవుననే చెప్పాలి. జానారెడ్డి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ వీళ్లంత పరిచయం అక్కర్లేని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. ఢిల్లీ పెద్దలు వీరిపై ఎంతో భరోసా పెట్టుకుని మరీ ప్రత్యేక గుర్తింపును కల్పించారు. కానీ వీరంతా ఇప్పుడు ఢిల్లీ పెద్దలకే షాకిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేతలతో పాటు మరికొంతమంది నేతలకు స్టార్ క్యాంపెయినర్లుగా […]

ఓటమి భయంతో వణుకుతున్న కాంగ్రెస్ సీనియర్లు!
X

కాంగ్రెస్ సీనియర్ నేతలను ఓటమి భయం వెంటాడుతోందా? టీఆర్ఎస్ ఊపులో తమ సీటు గల్లంతవ్వడం ఖాయమని వణికిపోతున్నారా? అవుననే చెప్పాలి. జానారెడ్డి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ వీళ్లంత పరిచయం అక్కర్లేని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. ఢిల్లీ పెద్దలు వీరిపై ఎంతో భరోసా పెట్టుకుని మరీ ప్రత్యేక గుర్తింపును కల్పించారు. కానీ వీరంతా ఇప్పుడు ఢిల్లీ పెద్దలకే షాకిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేతలతో పాటు మరికొంతమంది నేతలకు స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. స్టార్ క్యాంపెయినర్లు అంటే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ…. ప్రచారానికి ఊపు తీసుకురావాలి. కానీ వీరిలో ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లంతా ప్రచార క్షేత్రంలో ఎక్కడా కనిపించడం లేదు.

వీరందరితోపాటు మిగతా ముఖ్యనాయకులంతా, సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. సొంత నియోజవర్గాల్లో తీవ్రవ్యతిరేకత వస్తుండటంతో గడపదాటి బయటకు రావడంలేదు. తమ నియోజవర్గాల్లోనే పార్టీముఖ్యనేతలతో ప్రచారసభలు పెట్టించుకుని నానాతంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులం అంటూ చెప్పుకునే…. నేతల తలరాతలే తారుమారు కానున్నాయంటూ పలు సర్వేలు చెప్తుడంటంతో…. ఎక్కడలేని భయం వీరిని వెంటాడుతోందట.

స్టార్ క్యాంపెయినింగ్ పక్కనపెట్టి… ముందు ఇల్లు చక్కబెట్టుకునేందుకు సీనియర్లంతా నియోజక వర్గాలకే పరిమితమయ్యారని సెటైర్లు వేస్తున్నారు. పక్క నియోజకవర్గాన్ని కూడా తొంగిచూడలేనంత ఓటమి భయం వీరందర్నీ వెంటాడుతోందట. గులాబీపార్టీ సునామీలో గల్లంతవ్వడం ఖాయమనే ఆందోళన వారిని తీవ్రంగా బాధిస్తోందంటున్నారు.

First Published:  2 Dec 2018 8:33 AM GMT
Next Story