Telugu Global
NEWS

"ఎవరికో పుట్టిన బిడ్డలకు తండ్రులు...." " టీఆర్‌ఎస్‌పై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ … టీఆర్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై నేరుగా విమర్శలు చేశారు. కేసీఆర్‌ కాకమ్మ కథలు చెప్పడం మానుకోవాలన్నారు. చంద్రబాబుపై కుళ్లు జోకులు వేయవద్దని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలనుకుంటే అది అయ్యే పనికాదన్నారు. రాళ్లలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వివేకానంద నగర్‌లో ప్రసగించిన బాలకృష్ణ… పలు అభ్యంతరకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డలకు కొందరు తామే తండ్రులమని […]

ఎవరికో పుట్టిన బిడ్డలకు తండ్రులు....  టీఆర్‌ఎస్‌పై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు
X

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ … టీఆర్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై నేరుగా విమర్శలు చేశారు. కేసీఆర్‌ కాకమ్మ కథలు చెప్పడం మానుకోవాలన్నారు. చంద్రబాబుపై కుళ్లు జోకులు వేయవద్దని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలనుకుంటే అది అయ్యే పనికాదన్నారు.

రాళ్లలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వివేకానంద నగర్‌లో ప్రసగించిన బాలకృష్ణ… పలు అభ్యంతరకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డలకు కొందరు తామే తండ్రులమని చెప్పుకుని బతుకుతున్నారని టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చరిత్రను తుడిపేయాలంటే హైటెక్‌ సిటీని మూసేయాల్సి ఉంటుందని…. అలాచేసే దమ్ము టీఆర్‌ఎస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబును వద్దనుకుంటే శంషాబాద్ ఎయిర్‌పోర్టును మూసివేయాల్సి ఉంటుందని… అలా మూసేసి చూడండి ఏమవుతుందో అని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు చరిత్రను మాయంచేయాలంటే హైదరాబాద్‌లో ఫైఓవర్లను మాయం చేయాల్సి ఉంటుందని… అలా చేసే దమ్ముందా బిడ్డా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

అవుటర్‌ రింగ్‌ రోడ్డును తెచ్చిన చంద్రబాబును అవుట్‌ ఆఫ్‌ డేట్‌ చేయాలనుకుంటే అంతకు మించిన అవుట్‌ అండ్ అవుట్‌ కమెడియన్లు మరొకరు ఉండరన్నారు.

టీఆర్‌ఎస్‌ నేతల గల్లీ బుద్దులు చూస్తుంటే తనకు జాలేస్తోందన్నారు బాలకృష్ణ. సైనా నెహ్వాల్‌, పీవీ సింధూలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మాహిస్మతి సామ్రాజ్యానికి భల్లాల దేవుడే ప్రభువు అయినా…. ప్రజల గుండెల్లో మాత్రం బాహుబలే ఉంటారని…. చంద్రబాబు ఒక బాహుబలి అని బామ్మర్ధి బాలకృష్ణ కితాబిచ్చాడు.

టీఆర్‌ఎస్‌ది లాటరీ అయితే చంద్రబాబుది హిస్టరీ అని చెప్పారు. గత ఎన్నికల్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నుంచి టీడీపీ తరపున గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నయవంచకులకు గుణపాఠం చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

First Published:  2 Dec 2018 2:03 AM GMT
Next Story