Telugu Global
Cinema & Entertainment

శ్రీనువైట్ల తో సినిమా కి నో చెప్పిన కింగ్

వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న శ్రీనువైట్ల “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాతో హిట్ ఫార్మ్ లోకి వస్తాడు అనుకున్నారు అంతా, కానీ రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఇక శ్రీనువైట్ల తన తదుపరి సినిమాని అఖిల్ తో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో “మిస్టర్ మజ్ను” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని జనవరిలో విడుదల చేయడానికి నిర్మాతలు […]

శ్రీనువైట్ల తో సినిమా కి నో చెప్పిన కింగ్
X

వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న శ్రీనువైట్ల “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాతో హిట్ ఫార్మ్ లోకి వస్తాడు అనుకున్నారు అంతా, కానీ రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఇక శ్రీనువైట్ల తన తదుపరి సినిమాని అఖిల్ తో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో “మిస్టర్ మజ్ను” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని జనవరిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అయిపోగానే నాగార్జున అఖిల్ ని శ్రీనువైట్ల దర్శకత్వంలో ఉంటుందని చెప్పాడు అంట, కానీ అంతకన్న ముందు శ్రీనువైట్ల ని ఒక హిట్ సినిమా డైరెక్ట్ చేసి రమ్మన్నాడట. కాని కట్ చేస్తే భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు శ్రీనువైట్ల. ఇక ఫ్లాప్ తో నాగార్జున దగ్గరకి వెళ్ళే సరికి నాగార్జున శ్రీనువైట్ల కి నో చెప్పాడట. అఖిల్ ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటువంటి సమయంలో అఖిల్ ను శ్రీనువైట్ల చేతిలో పెట్టాలని నాగార్జున భావించడం లేదట.

First Published:  1 Dec 2018 4:00 AM GMT
Next Story