Telugu Global
NEWS

బాబును తరిమేస్తాం... ఆంధ్రాలో కూడా వేలుపెడతాం " కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పుడు పనులు చేసిన చంద్రబాబు ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. తాము ఏనాడు ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టలేదన్నారు. చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే అవసరం వచ్చినప్పుడు తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కేసీఆర్‌ సరైన సమయంలో బుద్ధి చెబుతారని […]

బాబును తరిమేస్తాం... ఆంధ్రాలో కూడా వేలుపెడతాం   కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
X

చంద్రబాబుపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పుడు పనులు చేసిన చంద్రబాబు ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు.

తాము ఏనాడు ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టలేదన్నారు. చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే అవసరం వచ్చినప్పుడు తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కేసీఆర్‌ సరైన సమయంలో బుద్ధి చెబుతారని వెల్లడించారు. మీడియా, డబ్బు చుట్టూ చంద్రబాబు రాజకీయం తిరుగుతోందన్నారు.

50లక్షల బ్యాగ్‌తో దొరికిపోయింది చంద్రబాబు మనిషి కాదా అని ప్రశ్నించారు. ఫోన్‌లో మన వాళ్లు బ్రీఫ్డ్‌మీ అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇన్ని చేసి కూకట్‌పల్లి వచ్చి అమాయకంగా నేనేం చేశా అంటే కుదరదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

నిలదీయాల్సి వచ్చిన రోజు తెలంగాణలో చీమునెత్తురు ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీస్తారన్నారు. కూకట్‌పల్లికి వచ్చి కులం ఆధారంగా రాజకీయాలు చేస్తామంటే తిప్పికొడతామన్నారు.

నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే సుహాసినిని తీసుకెళ్లి నేరుగా లోకేష్ తరహాలో మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఓడిపోయే సీటు ఇచ్చి నందమూరి కుటుంబాన్ని బలి చేసేందుకే సుహాసినిని కూకట్‌పల్లిలో చంద్రబాబు నిలబెట్టారన్నారు.

First Published:  1 Dec 2018 5:58 AM GMT
Next Story