Telugu Global
NEWS

ఏపీలో నా మిత్రుడు జగన్‌ స్వీప్‌ చేస్తాడు.... సరిగ్గా కార్డు ప్లే చేస్తే 25 లోక్‌సభ స్థానాలు జగన్‌వే....

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ రిపబ్లిక్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే తన మిత్రుడు జగన్‌మోహన్‌ రెడ్డి స్వీప్‌ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రపదేశ్‌లో జగన్ వేవ్‌ ఆవరించి ఉందన్నారు. సరిగ్గా కార్డు ప్లే చేసి… సరైన అభ్యర్థులను నిలబెట్టగలిగితే 25 లోక్‌సభ స్థానాలలో 25 వైసీపీనే గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఫైట్ జగన్‌, టీడీపీ […]

ఏపీలో నా మిత్రుడు జగన్‌ స్వీప్‌ చేస్తాడు.... సరిగ్గా కార్డు ప్లే చేస్తే 25 లోక్‌సభ స్థానాలు జగన్‌వే....
X

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ రిపబ్లిక్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే తన మిత్రుడు జగన్‌మోహన్‌ రెడ్డి స్వీప్‌ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రపదేశ్‌లో జగన్ వేవ్‌ ఆవరించి ఉందన్నారు.

సరిగ్గా కార్డు ప్లే చేసి… సరైన అభ్యర్థులను నిలబెట్టగలిగితే 25 లోక్‌సభ స్థానాలలో 25 వైసీపీనే గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఫైట్ జగన్‌, టీడీపీ మధ్యే ఉందని… ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఏపీని జగన్‌ స్వీప్ చేసేస్తారని ఓవైసీ వ్యాఖ్యానించారు.

తనను కేసీఆర్‌కు గులాం అని కాంగ్రెస్ అనడంపై అసద్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుమారస్వామిని కూడా బీజేపీకి బీ టీం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసిందని… ఎన్నికల తర్వాత మాత్రం అదే కుమారస్వామితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అసద్ విమర్శించారు.

తమను విమర్శిస్తున్న రాహుల్‌ గాంధీ వచ్చేపార్లమెంట్‌ ఎన్నికల్లో సొంతంగా 120 సీట్లు గెలుచుకోమనండి చాలూ అంటూ ఓవైసీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ సొంతంగా 120 సీట్లు గెలుచుకుంటే చాలని.. అలా గెలుచుకోగలరేమో రాహుల్‌ గాంధీ చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు గెలవడం చేతగాక మిగిలిన పార్టీలపై నిందలేయడం సరికాదన్నారు.

2019లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమే అధికారంలోకి వస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందన్నారు ఓవైసీ.

First Published:  1 Dec 2018 9:19 AM GMT
Next Story