Telugu Global
Cinema & Entertainment

2.0 మూవీ 2 రోజుల వసూళ్లు

మొదటి రోజు 12 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ మాత్రమే రాబట్టిన 2.0 సినిమా, రెండో రోజు ఇంకాస్త మెరుగుపడింది. శుక్రవారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో 2.0 సినిమాకు 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 76 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, యూవీ […]

2.0 మూవీ 2 రోజుల వసూళ్లు
X

మొదటి రోజు 12 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ మాత్రమే రాబట్టిన 2.0 సినిమా, రెండో రోజు ఇంకాస్త మెరుగుపడింది. శుక్రవారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో 2.0 సినిమాకు 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు.

తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 76 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, యూవీ వంశీ కలిసి ఈ సినిమా హక్కులు దక్కించుకున్నారు.

ఫస్ట్ వీకెండ్ లో (4 రోజులు) 50 కోట్ల రూపాయల షేర్ ఆశిస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ బట్టి చూస్తే, 4 రోజుల్లో 50 కోట్ల షేర్ కష్టమని తేలిపోయింది.

ఏపీ, నైజాం 2 రోజుల షేర్
నైజాం – రూ. 7.41 కోట్లు
సీడెడ్ – రూ. 2.93 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.43 కోట్లు
ఈస్ట్ – రూ. 1.45 కోట్లు
వెస్ట్ – రూ. 1.04 కోట్లు
గుంటూరు – రూ. 1.47 కోట్లు
కృష్ణా – రూ. 1.06 కోట్లు
నెల్లూరు – రూ. 0.94 కోట్లు

First Published:  1 Dec 2018 5:17 AM GMT
Next Story