Telugu Global
NEWS

నన్ను చంపే కుట్ర.... త్వరలోనే భారీగా దాడులు

కాంగ్రెస్‌ తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉంటూ ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రచారం చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పు ఉందని పదేపదే వాపోతున్నారు. హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని… అందుకే తనకు భద్రతను పెంచడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమిళనాడు ఆర్కే నగర్‌ తరహాలో కొడంగల్‌ ఎన్నిక వాయిదా వేయించేందు కోసం తనను హత్య చేయాలనుకుంటున్నారని చెప్పారు. తనకు కేంద్ర భద్రతా దళాలతో భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించినా ఇప్పటికీ ఆ దిశగా […]

నన్ను చంపే కుట్ర.... త్వరలోనే భారీగా దాడులు
X

కాంగ్రెస్‌ తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉంటూ ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రచారం చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పు ఉందని పదేపదే వాపోతున్నారు. హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని… అందుకే తనకు భద్రతను పెంచడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తమిళనాడు ఆర్కే నగర్‌ తరహాలో కొడంగల్‌ ఎన్నిక వాయిదా వేయించేందు కోసం తనను హత్య చేయాలనుకుంటున్నారని చెప్పారు. తనకు కేంద్ర భద్రతా దళాలతో భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించినా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలను పెంచుతోందన్నారు.

చంద్రబాబు తెలంగాణలో అడుగుపెడితే మూడో కన్ను తెరుస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడు తెరుస్తారా అని సవాల్ చేశారు. ఫాంహౌజ్‌లో కూర్చుని నాలుగు పెగ్గులేస్తే కేసీఆర్‌కు ఉన్న కళ్లే మూసుకుపోతాయని… ఇక మూడో కన్ను ఎక్కడ తెరుస్తారని ఎద్దేవా చేశారు.

కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి ఇంటిలో ఐటీ సోదాలు నిర్వహించగా 17. 51 కోట్లు దొరికాయన్నారు. కానీ మోడీ ఒత్తిడి కారణంగా ఆ వివరాలు బయటకు రాకుండా ఎన్నికల అధికారులు గోప్యత పాటిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

First Published:  29 Nov 2018 10:53 PM GMT
Next Story