Telugu Global
NEWS

నేను రాష్ట్రానికి పరిమితమవడం భావ్యం కాదు " కలెక్టర్లతో చంద్రబాబు

అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ లక్ష్యాలను కలెక్టర్లకు వివరించారు. తాను జాతీయ రాజకీయాల్లో పనిచేయాల్సిన అవసరం మళ్లీ వచ్చిందన్నారు. దేశంలో ప్రజలంతా నిరాశలో కూరుకు పోయారన్నారు. మోడీ పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిందన్నారు. రాష్ట్రం భవిష్యత్తును దేశ రాజకీయాలే నిర్ణయిస్తాయన్నారు. అందుకే తాను పొలిటికల్ గవర్నెన్స్ దిశగా ముందుకెళ్తున్నానని చెప్పారు. తాను రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావడం భావ్యం కాదన్నారు. తాను జాతీయస్థాయిలో […]

నేను రాష్ట్రానికి పరిమితమవడం భావ్యం కాదు  కలెక్టర్లతో చంద్రబాబు
X

అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ లక్ష్యాలను కలెక్టర్లకు వివరించారు. తాను జాతీయ రాజకీయాల్లో పనిచేయాల్సిన అవసరం మళ్లీ వచ్చిందన్నారు.

దేశంలో ప్రజలంతా నిరాశలో కూరుకు పోయారన్నారు. మోడీ పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిందన్నారు. రాష్ట్రం భవిష్యత్తును దేశ రాజకీయాలే నిర్ణయిస్తాయన్నారు. అందుకే తాను పొలిటికల్ గవర్నెన్స్ దిశగా ముందుకెళ్తున్నానని చెప్పారు.

తాను రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావడం భావ్యం కాదన్నారు. తాను జాతీయస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబు కలెక్టర్లతో వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

టీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత టీంను సమర్ధవంతంగా నడిపించే సామర్థ్యం నాయకుడికి ఉండాలన్నారు. హైదరాబాద్‌లో అనేక సదుపాయాలున్నాయన్నారు. అందుకే చాలా మంది విభజన తర్వాత ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడడం లేదన్నారు. ఏపీలో ఏముందని రావాలి అని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

విద్యుత్ శాఖలో దేశంలోనే తొలిసారి సంస్కరణలు తెచ్చిన వ్యక్తిని తానేనని కలెక్టర్లకు చంద్రబాబు వివరించారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని కలెక్టర్లకు మళ్ళీ చెప్పారు.

సైబరాబాద్‌ తన మానసపుత్రిక అని, కేసీఆర్‌కే సవాల్ చేసి వచ్చానని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్‌ వచ్చాక ఒక ఫాంహౌజ్ మాత్రమే కట్టారని విమర్శించి వచ్చానని కలెక్టర్లతో ముఖ్యమంత్రి వివరించారు.

First Published:  29 Nov 2018 11:26 PM GMT
Next Story