Telugu Global
Cinema & Entertainment

పెళ్లి మాట ఎత్తితే సీరియస్ అవుతున్న త్రిష

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ లోనే ముదురు భామగా పేరు తెచ్చుకున్న త్రిష ఇటివలే “96” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ కొన్నేళ్ళ ముందు తను ప్రేమించిన ఒక వ్యక్తితో పెళ్లి వరకు వెళ్ళింది, కానీ ఈ ఇద్దరు ప్రేమికుల మధ్య ఏదో తేడా రావడంతో ఇద్దరు బ్రేక్ అప్ చెప్పుకున్నారు. బ్రేకప్ అయిన తర్వాత త్రిష మళ్ళీ సినిమాలతో బిజీ అయింది. అప్పటి నుంచి త్రిష పై […]

పెళ్లి మాట ఎత్తితే సీరియస్ అవుతున్న త్రిష
X

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ లోనే ముదురు భామగా పేరు తెచ్చుకున్న త్రిష ఇటివలే “96” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ కొన్నేళ్ళ ముందు తను ప్రేమించిన ఒక వ్యక్తితో పెళ్లి వరకు వెళ్ళింది, కానీ ఈ ఇద్దరు ప్రేమికుల మధ్య ఏదో తేడా రావడంతో ఇద్దరు బ్రేక్ అప్ చెప్పుకున్నారు. బ్రేకప్ అయిన తర్వాత త్రిష మళ్ళీ సినిమాలతో బిజీ అయింది. అప్పటి నుంచి త్రిష పై పలు రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా త్రిష ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చకర్లు కొడుతున్నాయి. పెళ్లి వార్తతో పాటు నయనతారతో త్రిష విభేదాల గురించి కూడా తమిళ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న న్యూస్. ఇక ఇప్పుడు త్రిష వీటన్నింటికీ సమాధానం ఇచ్చింది. పెళ్లి గురించి ప్రస్తుతం తానూ ఆలోచించడం లేదని, మనసున్న వ్యక్తి కనిపిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోడానికి నేను రెడీ, కానీ మాటి మాటికి నా పెళ్లి టాపిక్ తీస్తే మాత్రం అస్సలు బాగోదు అంటూ సీరియస్ అయ్యింది ఈ భామ.

ఇక నయనతారతో విభేధాల గురించి మాట్లాడుతూ మా మధ్య ఎలాంటి వివాదం లేదు దయచేసి ఇలాంటి రూమర్స్ సృష్టించకండి అని అంటుంది త్రిష.

First Published:  28 Nov 2018 9:55 PM GMT
Next Story